Hardik Pandya Fastest Fifty: వైవాహిక జీవితం విడాకులకు దారితీసింది. ఎంత సెలబ్రిటీ అయినప్పటికీ.. ఏ స్థాయిలో డబ్బు ఉన్నప్పటికీ ఆ బాధ అతడిని తీవ్రంగా కలచివేతకు గురిచేసింది.. ఇన్ని ఇబ్బందుల మధ్య అతడు టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించాడు.. కానీ ఆ తదుపరి టోర్నీలలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు.. ఇలాంటి క్రమంలోనే గాయపడ్డాడు.. చాలా రోజులపాటు క్రికెట్ కు దూరమయ్యాడు. నాణ్యమైన ఆల్ రౌండర్ అయినప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు. చివరికి జట్టులోకి వచ్చాడు.. తను ఏమిటో.. ఎలాంటి ఆటగాడినో మరోసారి నిరూపించుకున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. టీమిండియా 231 పరుగులు చేయడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా అనడంలో ఎటువంటి సందేహం లేదు. తిలక్ వర్మ 73 పరుగులు చేసినప్పటికీ.. హార్దిక్ పాండ్యా సాధించిన 63 పరుగులకే ఎక్కువ విలువ.. ఎందుకంటే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసి, పర్యాటక జట్టు బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడంలో హార్దిక్ పాండ్యా విజయవంతమయ్యాడు. తద్వారా టీమిండియా భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయంటే.. అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ నాలుగో వికెట్ కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.. తద్వారా టీమిండియా భారీగా పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా మైదానంలో ఉన్న సేపు ప్రేక్షకులు ఊగిపోయారు.. పాండ్యా పాండ్యా అంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఇదే మైదానంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఐపీఎల్ సమయంలో నిరసనలు కూడా చవిచూశాడు.. ఐపీఎల్ లో గుజరాత్ అతడికి సొంత జట్టు. అహ్మదాబాద్ కూడా సొంతమైదానం. అతడు ముంబై జట్టుకు వెళ్లిపోవడం.. ముంబై జట్టుకు సారధిగా వ్యవహరించడంతో గుజరాత్ అభిమానులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు రోహిత్ అభిమానులు కూడా అతనిపై కక్ష కట్టారు. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మైదానంలో అయితే ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు.. అయితే అదే అహ్మదాబాద్ మైదానంలో ఎవరైతే తనను తిట్టారో.. ఎవరైతే తనను దూషించారో.. వారితోనే ప్రశంసలు అందుకున్నాడు హార్దిక్.. ప్రారంభం నుంచి చివరి వరకు బుల్లెట్ లాగా ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అహ్మదాబాద్ మైదానం మొత్తం అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది.