Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగనుంది. ఇరు జట్లు కూడా ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఈ మ్యాచ్ లో కూడా భారీ విజయాన్ని అందుకోవడానికి బరిలోకి దిగుతున్నాయి.ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి వరుసగా మూడో మ్యాచ్ లో విజయాన్ని సాధించిన టీం గా హిస్టరీ క్రియేట్ చేయాలని రెండు జట్లూ కూడా చూస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ మ్యాచ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తనదైన రీతిలో ప్రతిభను చూపించుకుంటు టీం కి అరుదైన విజయాన్ని దక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి ఇరు జట్ల బలాబలాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మొదటగా ఇండియన్ టీం ను తీసుకుంటే ఈ టీమ్ లో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే ఈ టీం లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా మంచి ప్రదర్శనను కనబరుస్తూ ఇండియన్ టీం కి చాలా బలంగా మారునున్నారు. ఇండియన్ టీం లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టీమ్ లో ఉండే 11 ప్లేయర్స్ మాత్రమే కాకుండా బెంచ్ కి పరిమితమైన ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.దాంతో ఇండియా కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు.
ఇక మొదటి రెండు మ్యాచ్ ల్లో డెంగ్యూ కారణంగా టీం కి దూరమైన శుభ్ మన్ గిల్ విషయం మనకు తెలిసిందే. ఆయన ప్లేస్ లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చాలా వరకు బాగా ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ వస్తాడా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. శుభ్ మన్ గిల్ కనక రాకపోతే మాత్రం ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కి వస్తాడు. ఈ మ్యాచ్ లో ఇండియా టీం తరఫున అత్యంత ప్రభావం చూపించే బ్యాట్స్ మెన్స్ లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , కేల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లు ఉన్నారు వీళ్ళు పాకిస్థాన్ టీమ్ మీద మాత్రం ఒక అద్భుతమైన నాక్ ఆడటానికి ఎప్పుడు రెడీగా ఉంటారు.
ఇక హార్దిక్ పాండ్యా కి అయితే పాకిస్తాన్ టీమ్ మీద మంచి రికార్డులు ఉన్నాయి. కాబట్టి వాటిని మార్చి ఇప్పుడు ఒక కొత్త రికార్డును సృష్టించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కోహ్లీ కూడా పాకిస్థాన్ మీద మ్యాచ్ అంటే ఎక్కడలేని ఉత్సాహంతో మ్యాచ్ చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించే దిశగా ముందుకు తీసుకెళ్తాడు అలా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీం మీద అద్భుతమైన పర్ఫామెన్స్ ని అయితే ఇస్తాడు…ఇక మన బౌలర్లలో పేస్ బౌలర్లు అయిన మహమ్మద్ సిరాజ్ అలాగే స్పిన్నర్లు అయినా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లు పాకిస్తాన్ టీం ప్లేయర్లని ఇబ్బంది పెడతారు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు. సిరాజ్, బుమ్రా ఇద్దరు కూడా వాళ్ళ టైప్ ఆఫ్ బౌలింగ్ తో పవర్ ప్లే లో పాకిస్తాన్ ప్లేయర్లని విపరీతంగా ఇబ్బంది పెడతారు…
ఒకసారి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ ని కనక చూసుకుంటే షఫీక్ రీసెంట్ గా సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే బాబర్ అజాం పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతూనే ప్రస్తుతం వరల్డ్ లోనే వన్డే ఫార్మాట్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కూడా కొనసాగుతున్నాడు.బాబర్ అజమ్ మంచి ప్లేయర్ అయినప్పటికీ ఇండియన్ టీం మీద మాత్రం ఇప్పటివరకు అంత మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి బాబర్ అజమ్ బాగా స్కోర్ చేయగలగితే చేస్తాడు,ఇక లేదు అంటే మాత్రం తొందరగా అవుట్ అయిపోతాడు. ఇక పాకిస్తాన్ టీం లో అత్యంత కీలకమైన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మహమ్మద్ రిజ్వాన్ అనే చెప్పాలి.
రిజ్వాన్ రీసెంట్ గా సెంచరీ చేసి తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక రిజ్వాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఒకసారి క్రీజ్ లోకి వచ్చిన తర్వాత నిదానంగా ఆడి ఆ తర్వాత క్రీజ్ లో పాతుకు పోయి గ్రౌండ్ నలుమూల షాట్స్ కొడుతూ అభిమానులను అలరిస్తు బౌలర్లకి చుక్కలు చూపిస్తాడు. కాబట్టి బౌలర్లు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి రిజ్వాన్ ని క్రీజ్ లోకి వచ్చిన వెంటనే అవుట్ చేయాలి, అలా చేస్తే పాకిస్థాన్ టీమ్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయవచ్చు. ఇక పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ విషయానికి వస్తే పాకిస్థాన్ ప్లేయర్లు పేస్ బౌలింగ్ ని ఒక విధంగా బాగానే ఎదుర్కొన్నప్పటికీ స్పిన్ విభాగంలో మాత్రం కొంతవరకు తడబడతారు. అశ్విన్, కుల్దీప్ యాదవులు ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా మారనున్నారు..
ఇక పాకిస్తాన్ టీం బౌలర్ల విషయానికి వస్తే ఈ టీంలో షహీన్ ఆఫ్రిది లాంటి పేస్ బౌలర్లు ఉన్నప్పటికీ మొన్న ఏషియా కప్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీం వీళ్ళ బౌలింగ్ లో అద్భుతంగా ఆడి భారీ స్కోరు చేశారు. కాబట్టి బౌలర్లు ఇండియన్ బ్యాట్స్ మెన్స్ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. విన్నర్లు అయినా నవాజ్, షాదాబ్ ఖాన్ లాంటి ప్లేయర్లు మాత్రం ఇండియన్ టీమ్ మీద భారీ ఇంపాక్ట్ చూపించబోతున్నారని తెలుస్తుంది. అయితే మన ఇండియన్ బ్యాట్స్ మెన్స్ కూడా స్పిన్నర్స్ ని బాగా ఆడతారు కాబట్టి ఈ మ్యాచ్ లో మన బ్యాట్స్ మెన్స్ వాళ్ల స్పిన్నర్లను చాలా ఈజీగా డీల్ చేస్తారు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఏ టీం గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తుందో చూడాలి…