IND Vs PAK: బౌలింగ్ కు సహకరించే మైదానంపై రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోవడం.. పాకిస్తాన్ జట్టుకు ప్రతికూల ఫలితాన్ని అందించేలా కనిపిస్తోంది. సౌద్ షకీల్ (62), మహమ్మద్ రిజ్వాన్ (46) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. కులదీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. 47 పరుగులకే పాకిస్తాన్ ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు. షకీల్ 62, రిజ్వాన్ 46 పరుగులు చేశారు. అయితే రిజ్వాన్ అక్షర పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షకీల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. దీంతో పాకిస్తాన్ 151 పరుగుల వద్ద మూడు, 159 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా మెరుగైన ఆట తీరు ప్రదర్శించలేదు. ఖుష్ దిల్ షా (38) మినహా మిగతా ఆటగాళ్లు గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. ఫలితంగా పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. అయితే ఈ మైదానంపై చేజింగ్ చేసే జట్టుకు అది పెద్ద టార్గెట్ కాదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
ROKO ఏం చేస్తారో?
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కటక్ మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసే టచ్ లోకి వచ్చాడు. అదే జోరు ఇటీవలి బంగ్లాదేశ్ మ్యాచ్లో చూపించాడు. వేగంగా 41 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టుపై చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. అయితే వీరిద్దరికి పాకిస్తాన్ నెట్టుపై మెరుగైన రికార్డులు ఉన్నాయి. పాకిస్తాన్ జట్టుతో ఐసీసీ టోర్నీలలో రోహిత్, విరాట్ 6, 8 ఇన్నింగ్స్ లు ఆడారు. రోహిత్ 350, విరాట్ 333 పరుగులు చేశారు. ఇందులో యావరేజ్ పరంగా రోహిత్ 58.3, విరాట్ 55.5 గా నమోదు చేశారు. ఇక రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. విరాట్ రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. అయితే పాకిస్తాన్ 242 పరుగుల టార్గెట్ విధించడంతో.. వీరిద్దరూ ఏ స్థాయిలో ఆడతారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ గనుక గెలిస్తే సెమిస్ ఆశలు స్థిరంగా ఉంటాయి.