IND Vs PAK: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ (IND vs PAK) తల పడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. ముందుగా బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. పాక్ జట్టులో షకీల్ 62, రిజ్వాన్ 46 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. కులదీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. 242 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా గెలుపు దిశగా ప్రయాణం సాగిస్తోంది.
విరాట్ కోహ్లీ (84*), శ్రేయస్ అయ్యర్ (56) పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ( 20), గిల్(46) దూకుడుగా ఆడే క్రమంలో ఔట్ అయ్యారు.. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి వికెట్ కు టీమిండియా 31, రెండో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వంద పరుగుల వద్ద ఓపెనర్ గిల్ ఔట్ కావడంతో.. అయ్యర్ క్రీజ్ లోకి వచ్చాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత విరాట్ మైదానంలోకి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మూడో వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా గెలుపు బాట పట్టింది. ప్రారంభంలో అయ్యర్ నిదానంగా ఆడాడు. ఆ తర్వాత తన బ్యాటుకు పని చెప్పాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్ అంటే రెచ్చిపోతాడు. ఈ మ్యాచ్ లోనూ అదరగొట్టాడు..ఓ ఎండ్ లో గిల్, అయ్యర్ అవుట్ అయినప్పటికీ.. విరాట్ తన దూకుడు ఎక్కడా తగ్గించలేదు. 56 పరుగులు చేసిన అయ్యర్ ఖుష్ దిల్ షా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కాకపోతే అప్పటికే టీమిండియా గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది.
102 మీటర్ల ఎత్తులో..
అయితే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కొట్టిన సిక్స్ ఆకట్టుకుంది.. సల్మాన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా శ్రేయస్ అయ్యర్ కొట్టిన షాట్ సిక్సర్ గా మారింది. 102 మీటర్ల ఎత్తులో అతడు కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్లో అయ్యర్ కొట్టిన సిక్సరే భారిది కావడం విశేషం. సల్మాన్ బౌలింగ్లో అయ్యర్ గట్టిగా కొట్టిన షాట్ తో మైదానం మొత్తం హోరెత్తిపోయింది. అది సిక్సర్ గా మారడంతో టీమిండి అభిమానుల ఆనందం తారాస్థాయికి చేరింది. ఇదే క్రమంలో పాకిస్తాన్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఆ సిక్స్ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. విరాట్, అయ్యర్ మరింత దూకుడు కొనసాగించడంతో పాకిస్తాన్ బౌలర్లు చేతులెత్తేశారు..”శ్రేయస్ అయ్యర్ మామూలుగానే టెంపర్ మెంటుతో ఉంటాడు. అలాంటి ఆటగాడు తనకు నచ్చినట్టుగా బంతి వస్తే ఎలా ఊరుకుంటాడు. పాపం పాకిస్తాన్ బౌలర్ సల్మాన్ పిల్ల బచ్చగాడు. లేకపోతే అయ్యర్ కు అలాంటి బంతివేసి ఏం చేద్దాం అనుకున్నాడో.. ఈ రాత్రి అతనికి నిద్ర పట్టదు. ఎందుకంటే అయ్యర్ కొట్టిన సిక్సర్ అలాంటిది మరి అని” సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
SHREYAS IYER WITH A 102M SIX. pic.twitter.com/fN5AVHszJU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025