India Vs England : సుధీర్ఘ టెస్టు సీజన్ తర్వత టీమిండియా క్రికెట్ జట్టు జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. దీంతో భారత క్రికెట్ అభిమానుల దృష్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌పైకి మళ్లింది. ఆధునిక క్రికెట్‌లోని అత్యంత పటిష్టమైన ఇంగ్లండ్‌ను టీ20లో ఎదుర్కోవడానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీంతో సిద్ధమయ్యాడు. ఆగస్టు 2023 నుంచి టీమిండియా అతి తక్కువ ఫార్మాట్‌లో సుదీర్ఘ విజయవంతమైన పరుగును సాధించింది.తొమ్మిది సిరీస్‌లలో ఎనిమిది గెలిచి, ఒకదాన్ని డ్రా చేసుకుంది. 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత సీనియర్ ప్రోస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పదవీ విరమణ చేసిన తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.
హెడ్-టు-హెడ్ రికార్డ్
భారత్, ఇంగ్లండ్ జట్ట మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి నాలుగు సిరీస్‌లను కూడా టీమిండియానే గెలిచింది. దీంతో టీమిండియాను ఈ సిరీస్‌లో ఫేవరట్‌గా ప్రారంభించనుంది.
తుది జట్లు ఇలా..
భారతదేశం (IND)
సూర్యకుమార్ యాదవ్ (సి), సంజు సామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
ఇంగ్లాండ్ (ENG)
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్
ప్రత్యక్ష ప్రసారం మరియు స్ట్రీమింగ్ వివరాలు
ఇండియా – ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్‌లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు, మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో వీక్షించవచ్చు.
IND vs ENG T20I సిరీస్ షెడ్యూల్
1వ T20I: బుధవారం, 22 జనవరి 2025 కోల్‌కతాలో సాయంత్రం 7:00 గంటల నుండి
2వ T20I: శనివారం, 25 జనవరి 2025 చెన్నైలో సాయంత్రం 7:00 గంటల నుండి
3వ T20I: మంగళవారం, 28 జనవరి 2025 రాజ్‌కోట్‌లో సాయంత్రం 7:00 గంటల నుండి
4వ T20I: శుక్రవారం, 31 జనవరి 2025 పూణేలో సాయంత్రం 7:00 గంటల నుండి
5వ T20I: ఆదివారం, 02 ఫిబ్రవరి 2025 ముంబైలో సాయంత్రం 7:00 గంటల నుండి ముందుకు
మ్యాచ్ తేదీ.. సమయం.. వేదిక
మొదటి టీ20 జనవరి 22న ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2వ టీ20 జనవరి 25 ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
3వ టీ20 జనవరి 28 నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
4వ టీ20 జనవరి 31 MCA స్టేడియం, పూణే
5వ టీ20 ఫిబ్రవరి 2 వాంఖడే స్టేడియం, ముంబై