India Vs England 2nd Test: ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ రసకందాయంలో పడింది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.. మూడో రోజు ఆట స్టార్ట్ అయిన వెంటనే ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోవడం ఇండియన్ టీమ్ కి భారీ దెబ్బగా మారింది. జైశ్వాల్ 17 పరుగులు చేసి అవుట్ అవ్వగా, రోహిత్ శర్మ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ వీళ్లిద్దరి వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం కి శుభారాంబాన్ని ఇచ్చాడు. ఇక ఇప్పుడు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు క్రీజ్ లో ఉన్నారు. ఇండియా మంచి అవకాశాన్ని చేర్చుకుంటుందా ఇక ఈ మ్యాచ్ ను కూడా మొదటి మ్యాచ్ లాగే ముగించబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అసలు ఇండియన్ టీం ప్లేయర్లకు ఏమైందో తెలియడం లేదు. మొన్నటిదాక మంచి ఫామ్ లో కొనసాగిన ప్లేయర్లందరు ఇప్పుడు తీరా సమయం వచ్చేసరికి మాత్రం ఈజీగా గెలిచే మ్యాచ్ ను సైతం ఓడిపోతూ ఇండియన్ టీమ్ పరువు తీస్తున్నారు. ఇక ఈ టెస్ట్ లో ఈరోజు గనక ఎవరైనా ఒక ఇద్దరు ప్లేయర్లు లాంగ్ ఇన్నింగ్స్ ఆడకపోతే మాత్రం ఇండియా మొదటి మ్యాచ్ లో ఏదైతే పరాభవాన్ని చవి చూసిందో ఇప్పుడు కూడా అదే పరాభవాన్ని మూటగట్టుకోవల్సి వస్తుంది. ఇంగ్లాండ్ ప్లేయర్లని తక్కువ అంచనా వేసి మనవాళ్లు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.
ఇంగ్లాండ్ ప్లాన్ ఏంటో మనకి తెలియనీయకుండా నిదానంగా మన చేతుల్లో నుంచి మ్యాచ్ ను లాగేసుకుంతుంది. వాళ్ళు బస్ బాల్ గేమ్ ఆడుతూ తొందరగా పరుగులు చేస్తున్నారు. అదే బౌలింగ్ లో అయితే అందరూ కూడా ఏకతాటిపై నడుస్తూ ఇండియన్ ప్లేయర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో జైశ్వాల్ కనక లేకపోయి ఉంటే ఇండియా 150 పరుగులు కూడా చేసి ఉండేది కాదు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ని ఆడే ప్లేయర్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయంశముగా మారింది. ఒకవేళ ఏ ప్లేయర్ కూడా సరిగ్గ ఆడకపోతే మాత్రం ఈ మ్యాచ్ ని చేజేతులారా మరొకసారి జారవిడుచుకునే పరిస్థితి అయితే ఎదురవుతుంది.
ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు చాలా అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తూ బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోనూ చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఒక్కరోజు కనక ఇండియన్ టీం వికెట్లు పడిపోకుండా భారీ పరుగులు చేయగలిగితే మ్యాచ్ మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని చూపించి ఈ మ్యాచ్ ను కూడా ఈజీగా గెలుస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఈ ఒక్కరోజు ఇండియాకి చాలా కీలకంగా మారిపోతుంది. చూడాలి మరి ఈరోజు హీరోగా ఎవరు నిలుస్తారు అనేది…ఇక ప్రస్తుతం ఇండియన్ టీమ్ 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది శుభ్ మన్ గిల్ 37, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.ఇక ఇప్పటికే ఇండియా 238 పరుగుల ఆధిక్యం లో ఉంది…