India VS England : వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో పర్యటించే టెస్ట్ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఒక ఆటగాడి విషయంలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ కచ్చితంగా దృష్టి సారించాల్సి ఉంది. అవకాశం ఉన్నా, లేకపోయినా అతడిని కచ్చితంగా జట్టులోకి ఎంపిక చేయాలి. అతడిని ఎంపిక చేస్తేనే ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుపై అతడికి ఉన్న ట్రాక్ రికార్డు అటువంటిది.. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..
Also Read : ప్లేయింగ్ 11 కత్తిమీద సాము.. గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ అగ్నిపరీక్షలా ఇంగ్లండ్ టూర్?
వచ్చే నెల నుంచి
వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతుంది..2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ ను టీమిండియా ఈ సిరీస్ ద్వారానే మొదలుపెడుతుంది. ఒకరకంగా టీమ్ ఇండియాకు ఈ సిరీస్ అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఈ సిరీస్ లో కనుక టీమిండియా విజయం సాధిస్తే.. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటుంది. ఆ తర్వాత తన ప్రత్యర్థులపై తదుపరి ఆడే టెస్ట్ సిరీస్లలో మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఇంగ్లాండ్ జట్టుతో జరిగే ఈ సిరీస్ కు టీమిండియా అన్ని విధాలుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆటగాళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గిల్, బుమ్రా, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జూరెల్.. వంటి వారు సమర్ధులైనప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుపై వీరోచితమైన ఆట ఆడిన ప్లేయర్ గా మాత్రం శార్దూల్ ఠాకూర్ కు పేరుంది. ఎందుకంటే 2023లో ఇతడు ఇంగ్లాండ్ జట్టుపై వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్టులు ఆడిన ఇతడు.. 174 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో.. ఏకంగా రెండు హాఫ్ సెంచరీలను బ్యాక్ టు బ్యాక్ చేశాడు. ఇతడు ఆడిన ఇన్నింగ్స్ ద్వారా ఇంగ్లాండ్ జట్టును భారత్ 157 పరుగుల తేడాతో ఓడించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ ఏడాది టెస్టు సిరీస్ గెలుచుకోలేకపోయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుకు సొంత దేశంలో తిరుగులేని షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో.. తుది జట్టులో కచ్చితంగా శార్దూల్ ఠాగూర్ కు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు..” అతడు నాటి సిరీస్లో తిరుగులేని స్థాయిలో రాణించాడు. గొప్ప గొప్ప ప్లేయర్లు మొత్తం వెనకడుగు వేస్తుంటే.. అతడు మాత్రం తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. అందువల్ల అతడిని ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ కు ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని” మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram