India Vs England 4th Test: Team India’s amazing victory .. Collapsed England: నాలుగో టెస్టులో ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 4వ టెస్టులో 5వ చివరి రోజు ఇంగ్లండ్ ఓపెనర్లు అస్సలు ఔట్ కాకుండా పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ లంచ్ తర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. రెండు సెషన్లలోనే మొత్తం 8 వికెట్లను తీసి భారత బౌలర్లు ఇంగ్లండ్ ను చావు దెబ్బతీశారు. ఏకంగా టీమిండియాకు 157 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని కట్టబెట్టారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో ఇండియా జట్టు ఏకంగా 10 ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీసి సత్తా చాటింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిర్ధేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 210 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు హమీద్ 63, రోరీ బర్న్స్ 50 పరుగులతో మాత్రమే భారత బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొని తొలి సెషన్ లో నిలువరించారు. వీరిద్దరూ ఔట్ కావడంతో ఇంగ్లండ్ పేకమేడలా కూలింది. బూమ్రా, జడేజా, ఉమేశ్, శార్ధుల్ లు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డివిరిచారు. జోరూట్ 38 పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అందరూ పెవిలియన్ కు క్యూ కట్టడంతో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ కు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా కూడా నిలువలేకపోయింది.
లంచ తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. చివరి సెషన్ ప్రారంభమైన 10 నిమిషాలకే ఇంగ్లండ్ జట్టు చివరి రెండు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో కోహ్లీ సేన ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరుఫున సెంచరీ చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.