India Vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 334 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి రోజు ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు.. శనివారం రెండవ రోజు ఓవర్ నైట్ స్కోర్ 302 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించింది. నైట్ వాచ్ మన్ రాబిన్ సన్ తో కలిసి జో రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వీరిద్దరూ ఎనిమిదవ వికెట్ కు 102 పరుగులు జోడించారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే రాబిన్సన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. జో రూట్ కూడా 120 కి పైగా పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని విడగొట్టడానికి రోహిత్ శర్మ చాలా ప్రయోగాలు చేశాడు. కానీ చివరికి ఈ జోడిని రవీంద్ర జడేజా విడగొట్టాడు.
మ్యాచ్ 102 ఓవర్ వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 347 పరుగులకు చేరుకుంది. అప్పటికి రాబిన్సన్ 58, రూట్ 119 పరుగులు చేశారు. రాబిన్ సన్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా బంతిని వేశాడు. ఆ బంతిని స్వీప్ షాట్ ఆడేందుకు రాబిన్ సన్ ప్రయత్నించాడు. ఆ బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్ ను తాకింది. తక్కువ ఎత్తులో వచ్చినప్పటికీ కీపర్ ధృవ్ తెలివిగా ఓడిసిపట్టాడు. దీంతో 347 పరుగుల వద్ద ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఆరు పరుగుల వ్యవధిలో బషీర్, అండర్సన్ వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ వికెట్లను కూడా జడేజానే పడగొట్టడం విశేషం. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా జడేజా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
రాబిన్ సన్ వికెట్ కు సంబంధించి బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. ” ఫాస్ట్ అండ్ జూరెల్” అంటూ క్యాప్షన్ రాసింది. కాగా, ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు. ధృవ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడంటూ నెటిజన్లు కితాబు ఇస్తున్నారు. 353 పరుగులకు ఇంగ్లీష్ జట్టు ఆల్ అవుట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. నాలుగు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను భారత్ కోల్పోయింది. అండర్సన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ బ్యాటర్ గా గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎప్పటిలాగే తన దూకుడైన ఆటను ప్రదర్శించాడు. లంచ్ బ్రేక్ వరకు 10 ఓవర్లలో భారత జట్టు 34 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 27(ఐదు ఫోర్ల సహాయంతో), గిల్ 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
In case you missed it, Dhruv Jurel’s fast hands pulled off an excellent catch behind the stumps. Such moments showcase the agility and skill of wicketkeepers. Follow the match for more action! #TeamIndia #INDvENG @dhruvjurel21 @IDFCFIRSTBank
— Abbasrajpoot (@abbasrajpoot990) February 24, 2024