India Vs Bangladesh: ఏం కొట్టావ్ రోహిత్ భయ్యా.. ఇది కదా నీ ట్రెడ్ మార్క్ షాట్.. పాపం బంగ్లా బౌలర్ ముఖం చూడాలి..

భారీ సిక్సర్ తో అలరించిన రోహిత్ శర్మ.. 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 23 పరుగులు చేశాడు. మహమ్మదుల్లా బౌలింగ్లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 7:32 am

India Vs Bangladesh

Follow us on

India Vs Bangladesh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను హిట్ మాన్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. బంగ్లాదేశ్ బౌలర్ షోరీ ఫుల్ ఇస్లాం వేసిన నాలుగో ఓవర్లో తనకు మాత్రమే సాధ్యమైన ట్రేడ్ మార్క్ ఫ్లిక్ షాట్ తో ఆకట్టుకున్నాడు.. రోహిత్ కొట్టిన కొట్టుడుకు ఆ బంతి గాల్లో తేలి.. స్టాండ్స్ లో పడింది.

ఆ బంతిని షోరీ ఫుల్ ఇస్లాం లెగ్ స్టంప్ దిశగా వేశాడు.. దానిని రోహిత్ శర్మ అత్యంత తెలివిగా పసిగట్టి ఫ్లిక్ షాట్ కొట్టాడు. ఫలితంగా ఆ బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ వెళ్లిపోయింది. అలా గాలిలో తేలిపోతున్న బంతిని చూసి బౌలర్ ఇస్లాం మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా వేదికలలో పంచుకుంది.. రోహిత్ కొట్టిన సిక్సర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..” చాలా రోజుల తర్వాత పాత రోహిత్ శర్మను చూస్తున్నాం. అతని ట్రేడ్ మార్క్ షాట్ అలరించింది. ప్రాక్టీస్ మ్యాచ్ లోనే కాదు, టోర్నీ మొత్తం ఇలాగే రోహిత్ శర్మ ఆకట్టుకోవాలని” అభిమానులు కోరుతున్నారు.

భారీ సిక్సర్ తో అలరించిన రోహిత్ శర్మ.. 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 23 పరుగులు చేశాడు. మహమ్మదుల్లా బౌలింగ్లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ శర్మకు జోడిగా వచ్చిన సంజు శాంసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో తన దూకుడు తనాన్ని ప్రదర్శించాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రిటైర్డ్ హర్ట్ గా రిషబ్ వెను తిరిగాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్, శివం దుబే క్రీజు లోకి వచ్చారు. టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. శనివారం ఉదయం జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి ఇచ్చాడు. అమెరికా వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేలా అతనికి ఈ అవకాశం కల్పించాడు.