India vs Bangladesh : అసియా కప్.. భారత్ ఇప్పటికే ఫైనల్ వెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మన ప్రత్యర్థి ఎవరో ఆదివారం లంక- పాక్ మధ్య జరిగే పోరు నిర్ణయిస్తుంది. ఈక్రమంలో షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక వేదికగా భారత్- బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఏ లెక్కన చూసినా ఇది అనామక మ్యాచ్. మన జట్టు గెలిస్తే ఫైనల్ ముందు బోనస్. బంగ్లాదేశ్ గెలిస్తే వారికో ఓదార్పువిజయం. ఇలాంటి మ్యాచ్‌ను ఏం చూస్తామని ప్రేక్షకులు కూడా అనుకోలేదు. వేలాదిగా వచ్చారు. అటు భారత్, ఇటు బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉత్సాహ పరిచారు. క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చాటారు.
భౌతికంగా ఎంతమంది అభిమానులు హాజరయ్యారో.. ఆన్‌లై న్‌లో అంతకుమించి అభిమానులు క్రికెట్ మ్యాచ్ చూశారు. ఆసి యా కప్ ను డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న నేప థ్యంలో ఆ యాప్ లో చాలా మంది భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ ను తిలకించారు. మొన్నామధ్య భారత్- పాక్ మ్యాచ్ ను చూసి న వారి కంటే ఎక్కువ మంది తిలకించారు. భారత్-పాక్ ను డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌లో 1.7 కోట్ల మంది వీక్షించగా.. ఈ రికార్డు కూడా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఏకంగా 2.2 కోట్ల రియల్ టైం వ్యూయర్స్ భారత్- బంగ్లా జట్ల మధ్య వీక్షించారు. కాగా, ఓ క్రికెట్ టోర్నీకి సంబంధించి ఇది హయ్యస్ట్ వ్యూయర్ షిప్ రికార్డని డిస్ని ప్లస్ హాట్‌స్టార్ పేర్కొంది.
కాగా, డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ దక్కడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన మైనది ఈ ఆసియా కప్‌ను ఎలాంటి ఫీజు లేకుండా చూసే అవకాశం కల్పించింది. దీంతో నెటిజన్లు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఇక వచ్చే నెలలో భారత్ వేదికగా నిర్వహించే వరల్డ్ కప్ పోటీలను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమ్ చేసే హక్కులను దక్కించుకుంది. కాగా, ఈ ఆసియా కప్ స్ట్రీమింగ్ రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ దక్కించుకోవడంతో డిస్ని ప్లస్ హాట్ స్టార్‌కు దండిగా ఆదాయం వస్తోంది. సెకన్ల వ్యవధి ప్రకటనకు రూ. కోట్లల్లో వసూలు చేస్తోంది.