https://oktelugu.com/

India vs Bangladesh 3rd Odi: క్రికెట్ చరిత్రలో రికార్డ్: ఇషాన్ డబుల్ సెంచరీ.. కోహ్లీ సెంచరీ.. ఇదికదా కొట్టుడంటే..

India vs Bangladesh 3rd Odi: టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే అందరూ భీకర ఆటగాళ్లే కనిపిస్తారు. కానీ బరిలోకి దిగితే మాత్రం తేలిపోతారు. ఇక ఈ మధ్యను అతి ఎక్కువైన ప్రయోగాలు కూడా టీమిండియా కొంప ముంచాయి. టీమిండియా కోచ్ గా ద్రావిడ్ వచ్చాక సీనియర్లను పక్కనపెట్టి కుర్రాళ్లకు అవకాశాల పేరిట చేస్తున్న ప్రయోగాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆసియాకప్ లో కప్ కొట్టకుండానే టీమిండియా వెనుదిరిగింది. ప్రపంచకప్ టీ20లోనూ అదే కథ. ఇప్పుడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ […]

Written By: NARESH, Updated On : December 10, 2022 3:09 pm
Follow us on

India vs Bangladesh 3rd Odi: టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే అందరూ భీకర ఆటగాళ్లే కనిపిస్తారు. కానీ బరిలోకి దిగితే మాత్రం తేలిపోతారు. ఇక ఈ మధ్యను అతి ఎక్కువైన ప్రయోగాలు కూడా టీమిండియా కొంప ముంచాయి. టీమిండియా కోచ్ గా ద్రావిడ్ వచ్చాక సీనియర్లను పక్కనపెట్టి కుర్రాళ్లకు అవకాశాల పేరిట చేస్తున్న ప్రయోగాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆసియాకప్ లో కప్ కొట్టకుండానే టీమిండియా వెనుదిరిగింది. ప్రపంచకప్ టీ20లోనూ అదే కథ. ఇప్పుడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లపై వన్డే సిరీస్ ను కోల్పోయింది. దారుణం ఏంటంటే పసికూన బంగ్లాదేశ్ పై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయి వన్డేసిరీస్ ను కోల్పోవడానికి ఏ భారత అభిమాని జీర్ణించుకోవడం లేదు.

ishan kishan

రెండు వన్డేలు ఓడి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాకు కెప్టెన్ రోహిత్ గాయంతో వైదొలిగాడు. దీంతో బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా భయపడ్డారు. ఈ క్రమంలోనే మూడో వన్డే ఈరోజు జరుగనుంది. ఈ వన్డే కూడా ఓడిపోతే ఇక టీమిండియా క్లీన్ స్వీప్ అయిపోయి ఘోరంగా ఓడిపోతుందని అంతా భయపడ్డారు. కానీ కెప్టెన్ రోహిత్ ప్లేసులో ఓపెనర్ గా వచ్చిన యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. అనితర సాధ్యమైన డబుల్ సెంచరీని ఈజీగా చేశాడు. కేవలం 134 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి బంగ్లాదేశ్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. భారత్ తరుఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ గా ఇషాన్ కిషన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

బంగ్లాదేశ్ పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ మరో రికార్డు నమోదు చేశాడు. వన్డేల చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే ఈ ఘనత సాధించి అతడి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్, విదేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్ గా కూడా ఇషాన్ కిషన్ నిలవడం విశేషం.

India vs Bangladesh 3rd Odi

ఇక ఇషాన్ కిషన్ కు విరాట్ కోహ్లీ చక్కటి సహకారం అందించాడు. విరాట్ కూడా 91 బంతుల్లో 113 పరుగులు సెంచరీ చేశాడు. సమయానుసారం గేర్ మార్చి ఇషాన్ కు సహకరించాడు. వీరిద్దరి జోడీనే 280 పరుగులకుపైగా రెండో వికెట్ కు నమోదు చేసింది.

ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్ లో 9 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో భారత్ నుంచే నలుగురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించడం విశేషం. రోహిత్ శర్మ ఏకంగా 3 సార్లు డబుల్ సెంచరీ చేయగా.. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ టెండూల్కర్ (200) కూడా ఈ జాబితాలో ఉన్నారు. విదేశీయుల్లో మార్టిన్ గప్తిల్, క్రిస్ గేల్, ఫఖర్ జామన్ కూడా డబుల్ సెంచరీలు చేశాడు.

ఇషాన్, కోహ్లీ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనించింది. దాదాపు 400 స్కోరు వరకూ చేరుకుంది.

Tags