https://oktelugu.com/

Fruits: చలికాలంలో ఈ పండ్లు తింటే.. సీజనల్ సమస్యలన్నీ పరార్!

చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి. మరి ఈ సీజన్‌లో తినాల్సిన ఆ పండ్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2024 / 05:30 AM IST

    Winter

    Follow us on

    Fruits:  ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే సీజనల్‌గా దొరికే పండ్లలో జామ, ఆపిల్, ఆరెంజ్ ఇలా రకరకాల పండ్లు ఉన్నాయి. చలికాలం ప్రారంభమైతే చాలా మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సీజన్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కొన్ని రకాల పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి. చలికాలంలో తప్పకుండా డైలీ పండ్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల పండ్లను తినకపోవడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా అయిన కూడా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి చెందవచ్చు. వింటర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి. మరి ఈ సీజన్‌లో తినాల్సిన ఆ పండ్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఖర్జూరాలు
    డ్రైఫ్రూట్స్‌లో ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. వీటిని ఉదయం పూట తినడం వల్ల రోజంతా అలసట, నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. చలికాలంలో ఎలాంటి సీజనల్ సమస్యలు రాకుండా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. డైలీ కనీసం నాలుగు నుంచి ఐదు తిన్నా చాలు. ఎలాంటి సమస్యలు ఉండవు.

    కివి
    రేటు అధికంగా ఉండే కివి పండ్లలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. కివి పండ్లలో ఎక్కువగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది.

    జామ పండ్లు
    జామపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది. డైలీ జామ పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. డైటరీ ఫైబర్ జామ పండ్లలో అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్ డి, కాల్షియం కూడా అందుతాయి.

    నారింజ పండ్లు
    విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి తొందరగా పెరుగుతుంది. అలాగే ఈ పండ్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా సాయపడతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.