IND vs BAN : కొడతారా.. నిలబడుతారా.. బంగ్లా ఎదుట కొండంత లక్ష్యం ఉంచిన టీమిండియా

IND vs BAN : ఓవర్ నైట్ స్కోర్ 133 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. కులదీప్ యాదవ్ 5 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇక తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. రెచ్చిపోయి ఆడింది. మొదటి ఇన్నింగ్స్ లో తేలిపోయిన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్నారు. కానీ 70 పరుగుల వద్ద తొలి వికెట్ భారత్ కోల్పోయింది. ఎప్పటిలాగానే రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. […]

Written By: Bhaskar, Updated On : December 16, 2022 9:09 pm
Follow us on

IND vs BAN : ఓవర్ నైట్ స్కోర్ 133 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. కులదీప్ యాదవ్ 5 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇక తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. రెచ్చిపోయి ఆడింది. మొదటి ఇన్నింగ్స్ లో తేలిపోయిన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్నారు. కానీ 70 పరుగుల వద్ద తొలి వికెట్ భారత్ కోల్పోయింది. ఎప్పటిలాగానే రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు.

వారేవా గిల్

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 70 పరుగుల వద్ద రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ కు పూజార తోడు కావడంతో ఇన్నింగ్స్ నల్లేరు మీద నడకయింది.. వీరిద్దరు కూడా జోరుగా బ్యాటింగ్ చేశారు.. బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇదే సమయంలో గిల్ 152 బంతుల్లో 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పూజార కూడా సెంచరీ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. గిల్ ఔట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ 19 పరుగులు చేశాడు. అప్పటికి భారత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు.. దీంతో భారత కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

ఆకట్టుకున్న ద్వయం

మొదటి వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా తనకు అచ్చి వచ్చిన టెస్ట్ ఫార్మాట్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను ఫోర్లు గా మలిచాడు. మొదటి ఇన్నింగ్స్ లో త్రుటి లో సెంచరీ కోల్పోయాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఆ తప్పు చేయలేదు. ధాటిగా ఆడాడు. ఒకప్పటి ద్రావిడ్ ను గుర్తు చేశాడు. ఇక గిల్ కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. రాహుల్ విఫల మైనా తాను నిలబడ్డాడు. బంగ్లా బౌలర్లతో కలబడ్డాడు. టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇతడు ఇలాగే ఆడితే రాహుల్ స్థానం ఎగిరిపోవడం ఖాయం.

కొండంత లక్ష్యం

భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో బంగ్లాదేశ్ ఎదుట 513 పరుగుల భారీ లక్ష్యం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 42 పరుగులు చేసి వికెట్లు ఏమీ నష్టపోలేదు.. శాంటో, జాకీర్ హుస్సేన్ క్రేజ్ లో ఉన్నారు. అయితే పిచ్ స్వభావం చూస్తే బౌలింగ్ కు బాగా అనుకూలిస్తోంది.. ముఖ్యంగా భారత్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఈ పిచ్ పై వికెట్లు రాబడుతుండడం జట్టుకు ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇంకా రెండు రోజులు ఆట ఉంది. హైదరాబాది పేసర్ మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, కులదీప్ యాదవ్ ను తట్టుకొని నిలబడాలంటే మామూలు విషయం కాదు.. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. అయితే నాలుగో రోజు త్వరగా ఆల్ అవుట్ చేసి మ్యాచ్ ముగించాలని భారత బౌలర్లు అనుకుంటున్నారు. ఉదయం పిచ్ పై తేమ ఉంటుంది కనుక బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు.