India Vs Australia T20 Series 2023: ఆస్ట్రేలియాపై ప్రతీకారం సాధ్యమేనా? తొలి సమరంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..?

నెక్స్ట్ ఇయర్ టి 20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలి అంటే దానికి సంబంధించినట్టుగానే ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో ఇండియన్ టీమ్ ఆడితేనే అభిమానుల్లో మళ్ళీ నమ్మకాన్ని చేకూర్చుకుంటుంది.

Written By: Gopi, Updated On : November 23, 2023 10:50 am

India Vs Australia T20 Series 2023

Follow us on

India Vs Australia T20 Series 2023: వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇలాంటి సమయంలోనే టీమిండియా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి మరొకసారి ఆస్ట్రేలియా తో మ్యాచ్ కి సిద్ధమవుతుంది. ఇక వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన ఓటమి నుంచి ప్లేయర్లు గాని అభిమానులు గాని తేరుకోవాలి అంటే ఇవాళ్ల ఆస్ట్రేలియా తో జరగబోయే టి20 మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అదరగొట్టాలి. ఇక నెక్స్ట్ ఇయర్ టి 20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలి అంటే దానికి సంబంధించినట్టుగానే ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో ఇండియన్ టీమ్ ఆడితేనే అభిమానుల్లో మళ్ళీ నమ్మకాన్ని చేకూర్చుకుంటుంది.

ఇక నెక్స్ట్ ఇయర్ జరగబోయే టి20 వరల్డ్ కప్ కి ఇప్పటినుంచి సన్నాహాలను సిద్ధం చేస్తూ పునాది వెయ్యాలని ఇండియన్ టీం అభిమానులు అందరూ కూడా వేయికన్నులతో వేచి చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో విశాఖపట్నం వేదికగా ఇవ్వాళ జరగనున్న మొదటి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ లో ఓడించినందుకు ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు మరి దానికి తగ్గట్టుగానే మన టీం కూడా గెలుపు కోసం ముందడుగు వేస్తుంది కానీ ఆస్ట్రేలియాను బీట్ చేసి ఎంత మేరకు రాణిస్తుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది.

ఇక ఈ టి 20 మ్యాచ్ లో ఓపెనర్ గా ఏ ప్లేయర్ ఆడతాడు అనేది కూడా తేలాల్సి ఉంది.ఇషాన్ కిషన్ యశస్వి జైశ్వాల్ రుతురాజ్ గైక్వాడ్ లాంటి ముగ్గురు టాప్ క్లాస్ ఓపెనర్లు ఉండటం తో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ పెద్ద సమస్య గా మారింది.ఇక సూర్య కెప్టెన్ గా ఈ సిరీస్ ని కైవసం చేసుకొని ఇండియన్ టీం గెలుపుని గర్వంగా చాటి చెప్పాలని చూస్తున్నప్పటికీ టీమ్ అంతా యంగ్ ప్లేయర్లు ఆడుతున్నారు. కాబట్టి అనుభవం లేని ప్లేయర్లు ఆస్ట్రేలియా టీమ్ ని ఎలా ఎదుర్కొంటరనేది కూడా ఇక్కడ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ వన్డే వరల్డ్ కప్ లో ఏ మాత్రం తన ప్రతిభను చూపించలేకపోయాడు ఆడిన ఏడు ఇన్నింగ్స్ ల్లో కూడా 106 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు.ఇక ఫైనల్ మ్యాచ్ లో తనకి ఆడే స్కోప్ ఉన్నప్పటికీ ఆ మ్యాచ్ లో కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేక తన పేలవ పర్ఫామెన్స్ ని కంటిన్యూ చేశాడు.మరి ఇప్పుడు ఈ సిరీస్ లో ఎంతవరకు రాణిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది.

ఇక టీం లో వీళ్ళతో పాటు తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్ వంటి అద్భుతమైన ప్లేయర్లు ఉండటం కూడా టీమిండియా కి కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే ముకేశ్‌, అర్ష్‌దీప్‌, రవి బిష్ణోయ్‌కు టీమ్ లో ఉండే అవకాశం ఉంది. మూడో పేసర్‌గా అవేశ్‌ ఖాన్ కంటే కూడా కంటే ప్రసిద్ధ్‌ కృష్ణ నే ఆడించే ఆస్కారముంది. అవేష్‌ కూడా కావాలనుకుంటే ముకేశ్‌ తప్పుకోవాల్సిందే. మరో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లో ఎవరాడతారో చూడాలి.ఇక ఇక్కడ టీ20ల్లో 2016లో శ్రీలంకపైన, 2022లో సౌతాఫ్రికా పైన గెలిచిన ఇండియn టీమ్…2019లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి అన్ని మ్యాచ్ లకి కలిపి ఒకేసారి రివెంజ్ తీర్చుకుంటుందా అనేది చూడాలి…

ఒకసారి ఇండియన్ టీం ప్లేయింగ్ లెవెల్ ని కనుక చూసుకున్నట్లయితే…

రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, వాషింగ్ టన్ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, ముకేశ్‌ లతో బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది…