India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్ కు అతడు దూరంగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో టీమిండియా కు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్ టెస్ట్ ద్వారా జట్టులోకి రోహిత్ వచ్చాడు. అయితే అతడు ఓపెనర్ గా కాకుండా, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. అయినప్పటికీ తన పూర్వపు ఫామ్ అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ల చేతిలో దాసోహం అయ్యాడు. బ్రిస్బేన్ టెస్టు లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడకుండా.. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తూ.. విమర్శల పాలవుతున్నాడు.
మెల్బోర్న్ టెస్ట్ లోను..
మెల్ బోర్న్ టెస్టులో గిల్ కు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో తనుష్ కొటియన్ కు చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే యాదృచ్ఛికంగా అతడు కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సి వచ్చింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు రోహిత్ శర్మ అవకాశం కల్పించడాన్ని సీనియర్ క్రికెటర్లు తప్పు బడుతున్నారు. సీనియర్ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఒక అడుగు ముందుకేసి.. రోహిత్ నిర్ణయాన్ని వింతల్లోకెల్లా వింత అని పేర్కొన్నాడు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ” మెల్బోర్న్ టెస్టులో జట్టు కూర్పుకు సంబంధించి రోహిత్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. గిల్ ను రిజర్వ్ బెంచ్ కు ఎందుకు పరిమితం చేశారో అర్థం కావడం లేదు.. ఇలా అయితే టీమిండియా బ్యాటింగ్ ఎలా బలోపేతం అవుతుంది? గిల్ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడిపై ప్రయోగాలు చేశారు. చివరికి ఇలా వదిలేసారని” సంజయ్ వ్యాఖ్యానించాడు..
సీనియర్ క్రికెటర్లు ఏమంటున్నారంటే.
గిల్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం పట్ల ఇతర సీనియర్ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. “గిల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడతాడు. వన్ డౌన్ బ్యాటర్ గా అదరగొడతాడు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం దారుణం. వాషింగ్టన్ సుందర్ కోసం గిల్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమిత చేయడం సరైన నిర్ణయం కాదు. గిల్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. వాషింగ్టన్ సుందర్ ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ పై మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ… ఉపఖండం మైదానాలకు, ఆస్ట్రేలియా మైదానాలకు తేడా ఉంటుంది. ఆస్ట్రేలియా మైదానాలపై ఇంతవరకు స్పిన్నర్లు సత్తా చాటిన దాఖలాలు లేవని” సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Strange selection of the playing XI. On a non-turning pitch, the change made neither strengthens the bowling much nor the batting. Gill dropped, is harsh! #INDvsAUS
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) December 25, 2024