India Tour Of West Indies: టీమిండియా జట్టు విజయాల జోరు మీదుంది. ఇంగ్లండ్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లు దక్కించుకుని విజయోత్సాహంతో ఉంది. ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా మరోమారు విదేశీ పర్యటనకు వెళ్తోంది. కరేబియన్ దీవుల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. వెస్టిండీస్ తో పోరులో తమదే పైచేయి కావాలని ఆశిస్తోంది. ఇందుకు గాను పటిష్టమైన వ్యూహాలు ఖరారు చేసుకుంది. ఆటగాళ్లను ఎలా దెబ్బకొట్టాలనే దానిపై జట్టు పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. ఇవాళ వెస్టిండీస్ కు బయలు దేరి వెళ్లి ఈనెల 22 నుంచి మ్యాచులు ఆడనుంది.
ఇప్పటికే మంచి బలంతో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం వెస్టిండీస్ కు సవాలే. కానీ ప్రత్యర్థిని అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. పైగా వారి సొంత గడ్డపై వారికి మంచి పట్టు ఉంటుంది. కానీ మనవారు కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. దీంతో టీమిండియా విజయాల బాట వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లండ్ లో పర్యటించి ఆ దేశాన్ని వైట్ వాష్ చేసిన ఇండియా వెస్టిండీస్ ను కూడా అలాగే చేయాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాలని ప్రయత్నిస్తోంది.
Also Read: Shreyas Iyer: టీమిండియా కెప్టెన్ కావాల్సిన శ్రేయాస్ అయ్యర్.. ఎందుకు ఇలా అయ్యాడు?
టీమిండియా విదేశాల్లోనూ ఘనమైన రికార్డులే నెలకొల్పుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో విజయాలు సాధిస్తూనే ఉంది. దీంతో కరేబియన్ దీవుల్లో కూడా మంచి ప్రదర్శన చేసి అభిమానుల కోరిక తీర్చాలని చూస్తోంది. వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండటం లేదు. టీ20 మ్యాచుల్లో మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతాడు. వన్డేలకు మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దీంతో టీమిండియా విజయాలు మూటగట్టుకుని స్వదేశానికి రావాలని అభిమానుల ఆకాంక్ష.
ట్రినిడాట్ వేదికగా జులై 22న ఒకటో వన్డే, 24న రెండో వన్డే, 27న మూడో వన్డే జరగనున్నాయి. ఇక టీ 20 మ్యాచులకొస్తే జులై 29న ట్రినిడాట్ లో మొదటి టీ 20, సెయింట్ కిట్స్ లో ఆగస్టు 1న రెండో టీ20, ఆగస్టు 2న మూడో టీ20, ప్లోరిడాలో ఆగస్టు 6న నాలుగో టీ20, ఆగస్టు 7న ఐదో టీ20 మ్యాచులు జరగనున్నాయి. దీంతో టీమిండియా విజయం సాధించి ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఇందుకు గాను అన్ని వ్యూహాలు ఖరారు చేసుకుంది. ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలనేదానిపై పక్కా వ్యూహరచన చేస్తోంది.
Also Read:Virat Kohli: విరాట్ కోహ్లి ఇక మారడా?.. ఉతికారేస్తున్న క్రికెట్ అభిమానులు