https://oktelugu.com/

winter season: చలికాలంలో చర్మానికి వేడి లేదా చల్లని నీరు ఏది మంచిది?

చల్లని నీరుతో స్నానం చేయడం వల్ల చలి వేస్తుందని కొందరు వేడి నీరుతో చేస్తారు. మరికొందరికి వేడి నీరుతో అలవాటు లేని వారు చల్లని నీటితో స్నానం చేస్తారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు కూడా వస్తాయి. అయితే చలికాలంలో ఏ నీటితో స్నానం చేయాలి? చర్మానికి, ఆరోగ్యానికి వేడి నీరు లేదా చల్లని నీరు ఏది మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 12, 2024 9:41 pm

Bath:

Follow us on

winter season: సాధారణంగా చాలామంది చర్మ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చెప్పక్కర్లేదు. ఎంత కేర్ తీసుకున్న కూడా చర్మం దెబ్బతింటుంది. ఈ కాలంలో ఎన్ని ప్రొడక్ట్స్ వాడిన కూడా చర్మం ఏదో విధంగా దెబ్బతింటుంది. చర్మం ఆరోగ్యంగా లేకపోతే అందవిహీనంగా కనిపిస్తారు. ఈ కాలంలో కొందరు జాగ్రత్తలు వహించకపోవడం వల్ల మెటిమలు, మచ్చలు వస్తుంటాయి. అయితే అందంగా ఉండాలని కొందరు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌లో రసాయనాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మ సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తాయి. అయితే చలికాలంలో స్నానం చేయాలంటే కొందరికి నచ్చదు. చల్లని నీరుతో స్నానం చేయడం వల్ల చలి వేస్తుందని కొందరు వేడి నీరుతో చేస్తారు. మరికొందరికి వేడి నీరుతో అలవాటు లేని వారు చల్లని నీటితో స్నానం చేస్తారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు కూడా వస్తాయి. అయితే చలికాలంలో ఏ నీటితో స్నానం చేయాలి? చర్మానికి, ఆరోగ్యానికి వేడి నీరు లేదా చల్లని నీరు ఏది మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అధికంగా ఉండే వేడి నీరు చర్మాన్ని, జుట్టుని కూడా హాని చేస్తుంది. వేడిగా ఉండే నీళ్లతో కంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. అయితే కొందరికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. పొడి చర్మ సమస్యలు ఉన్నవారు అయితే వేడి నీటితో స్నానం చేయకూడదు. అయితే వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. దీని వల్ల జుట్టు దెబ్బతింటుందిను పొడిగా మరియు నిర్జీవంగా మార్చుతుంది. తలస్నానం చేసేటప్పుడు చల్లని నీరు మంచిది. చల్లని నీటితోనే జుట్టు బలంగా ఉంటుంది. వేడి నీటితో జుట్టు బంకగా తయారవుతుంది. ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు తప్పకుండా చల్లని నీటితో చేయాలి. అయితే జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదు. దీనివల్ల మళ్లీ సీజనల్ సమస్యలు వస్తాయి. అలాగే చర్మ సమస్యలు ఉన్నవారు కూడా వేడి నీటితో స్నానం చేయకూడదు. అయితే గుండె సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మృదుత్వం కోల్పోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు, ముడతలు వంటివి వస్తాయి. అదే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గిపోవడం, కండరాలు మెరుగుపడటం, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం, నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ బాడీకి సెట్ అయ్యే విధంగా ఏ నీరు మంచివో తెలుసుకుని వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.