IND vs ENG 2nd T20 : భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ టీంతో భారత్ రెండో టీ20 ఆడేందుకు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వేదికపై భారత్ ఏడేళ్ల తర్వాత (After 7 Years)టీ20 మ్యాచ్ అడబోతోంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు కీలకంగా మారింది. ఓడితే సిరీస్‌లో మరింత వెనుకబడుతుంది. ఈ మ్యాచ్ భారత్‌కు కూడా కీలకం. ఇక్కడ ఓడితే ఇంగ్లాండ్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక చెపాక్ పిచ్‌పై భారత ట్రాక్ రికార్డు అంత మెరుగ్గా కూడా లేదు. టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్‌జదోనీ కూడా ఈ మైదానంలో ఓసారి విఫలమయ్యాడు.
చెపాక్‌లో ఆడింది రెండే..
భారత జట్టు చెపాక్‌లో ఇప్పటి వరకు కేవలం 2 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ప్రస్తుతం మూడో మ్యాచ్‌కు సిద్దమైంది. చివరి సారి 2018లో వెస్టిండీస్(West Indies)తో భారత జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. అయితే అంతకుముందు 2012లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బారత్‌కు షాక్ తగిలింది. ధోనీ(Dhoni) సారథ్యంలో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
సూర్యకుమార్ గెలిపిస్తాడా..
తాజాగా గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా, సూర్యకుమార్ సారథ్యంలో చెపాక్‌లో టీమిండియా మూడో టీ20 ఆడబోతోంది. సూర్యకుమార్ జట్టును బాగానే నడిపిస్తున్నారు. అయితే మొదటి టీ20లో విఫలమయ్యాడు. ఈమ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఈ వేదికపై సూర్యకుమార్(Surya kumar) ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు.. టీమిండియాను గెలిపిస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో భారత్ ఉన్నందున జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే చెపాక్ వేదిక భారత్‌కు అనుకూలిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఇంగ్లండ్‌తో గణాంకాలు ఇలా..
ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి. కానీ, విజిటింగ్ టీమ్‌కు ఎప్పుడైనా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉంది. ఇంగ్లిష్ టీమ్‌పై భారత్ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. ఇంగ్లండ్ మాత్రం 11 మ్యాచ్‌లే గెలిచింది. ఈసారి సూర్యకుమార్ సారథ్యంలో గెలిచి భారత ఆధిక్యాన్ని 15కు పెంచుతారని ఆశిస్తున్నారు.
ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు..
టీమిండియా..
అభిషేక్ శర్మ, సంజుసాంసన్(కీపర్), తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్,(కెప్టెన్), హార్దిక్‌పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్‌కుమార్‌రెడ్డి, అర్షదీప్‌సింగ్, మహ్మద్‌షమీ/రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్.
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్ బట్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మర్క్ వుడ్.