Anasuya : అనసూయ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్టు అయ్యుండొచ్చు. కానీ ఆమె కెరీర్ మొదలైంది కేవలం ఒక సాధారణ యాంకర్ గా మాత్రమే. ముందుగా ఆమె పలు న్యూస్ టీవీ చానెల్స్ లో యాంకర్ గా వ్యవహరించేది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది కానీ, అవి ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకొని రాలేదు. అలా ఇండస్ట్రీ లో నెగ్గుకురావడం కోసం ఎన్నో ఒడిదుడుగులు ఎదురుకుంటున్న సమయంలో ఆమెకు ‘జబర్దస్త్’ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఈ షో ద్వారా ఆమె సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చేసింది. స్టార్ యాంకర్ గా మారిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమె అందానికి ఫిదా అయిపోయారు. జబర్దస్త్ కారణంగా పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించిన ఈమెకు ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు క్యూలు కట్టాయి.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె రేంజ్ ఏ స్థాయికి వెళ్లిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఆమెకు ఉన్న అందానికి హీరోయిన్ అవ్వాలి. కానీ ఎందుకో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆమెను క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి, విలన్ రోల్స్ కి మాత్రమే తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే యాంకర్ అనసూయ జబర్దస్త్ లో కొనసాగుతున్న రోజుల్లో, తనపై వచ్చే జోక్స్ ని ఎలా తీసుకునేదో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కమెడియన్ సత్తిపండు చెప్పుకొచ్చాడు. ఒక ఎపిసోడ్ లో చమ్మక్ చంద్ర అనసూయ డైలీ లైఫ్ గురించి ఒక స్కిట్ చేసాడు. ఈ స్కిట్ లో అనసూయ గెటప్ లో చమ్మక్ చంద్ర కనిపించగా, ఆమె భర్త భరద్వాజ్ గెటప్ లో సత్తిపండి కనిపించాడు. ఈ స్కిట్ లో ఇద్దరు అబ్బాయిలు దూసుకొచ్చి నువ్వు రంగస్థలం సినిమా చేసినప్పటి నుండి నన్ను చిట్టి బాబు అని, అన్నయ్యని కుమార్ బాబు అని పిలిచేస్తున్నావ్ అని పంచ్ వేయగా, దీనికి అందరూ నవ్వేస్తారు.
ఇంతలో భరద్వాజ్ క్యారక్టర్ వేసిన సత్తిపండు అనసూయ గెటప్ వేసిన చమ్మక్ చంద్ర వద్దకు వచ్చి పిల్లల్ని రెడీ చేయ్, నాకు పప్పు వండే పని పడింది అని అంటాడు. దీనికి జడ్జిలలో ఒకరైన రోజా పాపం భరద్వాజ్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా ఎన్నో సెటైర్లు, ఫన్నీ ఎలిమెంట్స్ తో ఆ స్కిట్ ఉంటుంది. అనసూయ స్థానం లో వేరే యాంకర్ ఉండుంటే కచ్చితంగా ఫైర్ అయ్యేది. కానీ ఆమె చాలా తేలికగా తీసుకుంది, స్కిట్ ని స్కిట్ లాగానే చూసింది అంటూ చెప్పుకొచ్చాడు సత్తిబాబు. అనసూయ మాకు స్కిట్స్ విషయంలో అన్ని విధాలుగా సహకరించేదని, ఆమె కారణంగా స్కిట్స్ ఇంకా బాగా పండేవి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ సత్తిబాబు చెప్పిన ఆ స్కిట్ ని మీరు కూడా చూసేయండి.