India Vs England Test Series: ప్రస్తుతం ఇండియా టీం ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ని ఆడుతుంది. అందులో భాగంగా మొదటి టి 20 మ్యాచ్ లో ఇండియన్ టీం ఘన విజయం సాధించి 1-0 తేడాతో ఆఫ్గనిస్తాన్ పైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్స్ వాళ్ళ సత్తా చాటుతూ రెచ్చిపోతున్నారు . మిగిలిన రెండు మ్యాచ్ లను కూడా సక్సెస్ ఫుల్ గా విజయం సాధించి ఇండియన్ టీం కి టి 20 సిరీస్ ని అందించాలనే ఉద్దేశ్యం లో ఇండియన్ ప్లేయర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే టి 20 వరల్డ్ కప్ కి ముందు ఇండియా ఆడబోయే చివరి ఇంటర్నేషనల్ టి 20 సిరీస్ కూడా ఇదే కావడం విశేషం…
ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 25వ తేదీ నుంచి ఇండియన్ టీమ్ టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు సంబంధించిన ప్లేయర్ల లిస్టు ని ప్రకటించింది.ఇక సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తు ఉండగా జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక మొదటి టెస్ట్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన ప్లేయర్లను కనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే
రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, కే ఎస్ భరత్, దృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరజ్, ముఖేష్ కుమార్, అవేజ్ ఖాన్…లాంటి ప్లేయర్లు ఉన్నారు…
ఇక ఈ సిరీస్ ని ఎలాగైనా ఇండియన్ టీమ్ దక్కించుకోవాలి లేకపోతే 2025వ సంవత్సరంలో ఆడే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లకు ఇండియా అర్హత సాధించదు కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ఇండియన్ టీమ్ కి చాలా కీలకంగా మారబోతుంది. ఇక ఇంతకు ముందు సౌతాఫ్రికా తో ఆడిన టెస్ట్ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడితే అది 1-1 తో సమం అయింది అంతే తప్ప మనకు కప్పు అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఆడే 5 టెస్ట్ మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ని ఎలాగైనా ఓడించి ఇండియా ఘన విజయం సాధిం చాలి. అలా ఇండియన్ టీమ్ ఈ సిరీస్ గెలిస్తేనే మనం డబ్ల్యుటిసి ఫైనల్ లోకి అడుగు పెట్టే అవకాశం సులభం అవుతుంది…