India t20 world cup squad 2021: ప్రపంచ పొట్టి క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. భారత్ లో నిర్వహించాల్సిన టీ20 కప్ కరోనా కారణంగా ఈసారి యూఏఈ, ఒమన్ లకు షిఫ్ట్ అయ్యింది. అయితే భారత సారథ్యంలోనే ఈ మెగా టోర్నీ జరుగనుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా అన్ని దేశాలు తమ టీ20 టీంలను ప్రకటించాయి. భారత్ మాత్రం ఐపీఎల్(IPL) తర్వాత ప్రకటిద్దామని అనుకున్నా ఐసీపీ నిబంధనల ప్రకారం వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ సెలెక్టర్ల బృందం ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ తో ఈరోజు టెస్టు ముగియగానే టీంను ప్రకటించేందుకు సిద్ధమైంది. లేదంటా మంగళవారం ఉదయం జట్టును ప్రకటిస్తారని సమాచారం.
ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ , బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు గంగూలీ, జైషాలు ఇంగ్లండ్లో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమావేశమయ్యారని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరి అభిప్రాయాలు సేకరించారు. కొన్ని స్థానాల గురించి చర్చించారు.
అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుంది. తొలుత గ్రూప్-ఏ, గ్రూప్ బిలోని జట్లు తలపడుతాయి. ప్రతి గ్రూపులో అగ్రస్థానం నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 23 నుంచి ప్రధాన మ్యాచులు మొదలవుతాయి.
కాగా జట్టు ఎంపిక ఇప్పటికే పూర్తయ్యిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నాలుగు టెస్ట్ ఫలితం తేలిన తర్వాత సోమవారం ప్రకటించనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15మందికే చాన్స్ ఉన్నా బీసీసీఐ మాత్రం కరోనా తీవ్రత దృష్ట్యా బీసీసీఐ అదనంగా మరో ఐదుగురిని ఎంపిక చేయనుంది.. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది.
-భారత టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్రజడేజా, శార్ధుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్.
ఇక స్టాండ్ బైగా ఎవరైనా గాయపడితే.. ‘వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ఫృథ్వీ షా, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ