Today 28 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వ ఫల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు శివయ్య ఆశీస్సులు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొన్ని సంవత్సరాల నుంచి సమాచారం అందుతుంది. డబ్బు అప్పుగా ఇవాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కష్టపడిన దానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన రోజు. వారు ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలతో జాగ్రత్తగా ఉండాలి. వీటిని చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించకపోతే పెద్ద సమస్యగా మారుతుంది. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తవారితో ఎటువంటి రహస్యాలను పంచుకోకూడదు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అయితే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దీంతో ఖర్చును పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వివాహం చేసుకునేవారు శుభవార్తలు వింటారు. అనుకోని సంఘటనల వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. దీంతో మానసికంగా ఇబ్బందులకు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొన్ని కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి గురువుల సహకారం ఉంటుంది. ఏదైనా పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారాలు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు లక్షలను పూర్తి చేయడంలో బిజీగా మారుతారు. అయితే కొందరు వీటిని అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కోపాన్ని నియంత్రించుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్షలను పూర్తి చేయడానికి తోటి వారి సహకారాన్ని పొందుతారు. అదనపు బాధ్యతలు చేపట్టడంతో కాస్త బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపార ప్రణాళికలు లభిస్తాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. మనసులో కొంత గందరగోళంగా ఉంటుంది. అయితే ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారికి అన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. గతంలో ఉన్న కంటే ఇప్పుడు ఆదాయం మెరుగు పడుతుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. గతంలో చేపట్టిన వాటి నుంచి లాభాలు పొందుతారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని ప్రయాణాలు చేస్తారు. చట్టపరమైన చిక్కులు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడేటప్పుడు ఓర్పు వహించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. అనుకోకుండా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం ఖర్చు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : డబ్బు ఇతరులకు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎవరైనా విహారయాత్రలకు పిలిస్తే ఆలోచించాలి. దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే విద్యార్థులకు ఇదే మంచి రోజు. కష్టపడి పని చేయడం ద్వారా సరైన ఫలితాలు పొందుతారు.