Homeక్రీడలుక్రికెట్‌India Win Edgbaston: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ విజయం.. సీనియర్ క్రికెటర్లు చేసిన ట్వీట్లు వైరల్

India Win Edgbaston: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ విజయం.. సీనియర్ క్రికెటర్లు చేసిన ట్వీట్లు వైరల్

India Win Edgbaston: సచిన్ నాయకత్వం వహించాడు. విజయం అందించలేకపోయాడు. ధోని సారథ్యం వహించాడు గెలుపును దక్కించలేకపోయాడు. విరాట్ కోహ్లీ మార్గదర్శకత్వం వహించాడు. అప్పుడు కూడా విక్టరీ అందించలేకపోయాడు. రోహిత్ కెప్టెన్సీ వహించాడు. అప్పుడు కూడా గెలుపును ఇవ్వలేకపోయాడు. టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. చరిత్రలో మరుపురాని గెలుపులను దక్కించుకుంది. కానీ ఎడ్జ్ బాస్టన్ లో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఒకటి డ్రా.. మిగతావన్నీ ఓటములతో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అయితే రెండవ టెస్టు ఈ వేదిక మీద జరుగుతున్న నేపథ్యంలో విజయం సాధించడం కష్టమని అందరు అనుకున్నారు. పైగా జట్టులో బుమ్రా లేకపోవడాన్ని వారు ఉదహరించారు.

బుమ్రా లేకపోయినా.. సీనియర్ ప్లేయర్లు లేకపోయినా యువ జట్టు అద్భుతం సృష్టించింది. ముఖ్యంగా అనితర సాధ్యమైన స్థాయిలో ఆట తీరును ప్రదర్శించి అదరగొట్టింది. తొలి టెస్ట్ లో ఊహించని విధంగా ఓటమి ఎదురు కావడంతో.. టీమిండియా రెండో టెస్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏమాత్రం భయపడకుండా.. వెనుకడుగనేది వేయకుండా దుమ్మురేపింది. తద్వారా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది.. టీ గెలుపు ద్వారా టీం ఇండియాలో ఆశావాహ దృక్పథం పెరిగింది. టెస్ట్ సిరీస్ గెలుస్తామని నమ్మకం బలపడింది. టీం ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు జట్టును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

వాస్తవానికి ఐదో రోజు మ్యాచ్ లో చాలావరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వర్షం వల్ల మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహణకు అంపైర్లు ముగ్గు చూపించారు. ఓవర్లు కుదించినప్పటికీ టీమ్ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తద్వారా టీమిండియా ఇంగ్లాండ్ జట్టును ఓడించింది..ప్లాట్ పిచ్ పై పరుగులు చేయడంలో తడబడింది. ఇలాంటి జట్టుపై ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన నేపథ్యంలో అభిమానులు మాత్రమే కాదు.. లెజెండ్ క్రికెటర్లు కూడా అభినందిస్తున్నారు.. యువ జట్టు అటాక్ ఇంగ్లాండ్ జట్టు చేసిన ప్రదర్శన కంటే గొప్పగా ఉందని గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ అభిప్రాయపడ్డారు.. కెప్టెన్ గిల్, యశస్వి, రాహుల్, జడేజా, ఆకాష్, సిరాజ్ అదరగొట్టారని.. సమష్టిగా ఆడి.. జట్టుకు మరపురాని విజయాన్ని అందించారని కొనియాడారు.

ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతం చేశారని.. భయం లేని క్రికెట్ ఆడారని.. ఆటగాళ్లు అసలు సిసలైన ప్రదర్శన చేశారని సీనియర్ క్రికెటర్లు కొనియాడారు. ముఖ్యంగా ఆకాష్ దీప్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నారు. గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడని.. ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడని వివరించారు. టీమిండియా యువ ఆటగాళ్లు చూపించిన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని పేర్కొన్నారు. ఆటగాళ్లు ఇదే తీరుగా ఆడితే అద్భుతమైన విజయాలను మరిన్ని సాధిస్తారని వివరించారు. టీమిండియా ఈ స్ఫూర్తి కొనసాగించాలని సీనియర్ క్రికెటర్లు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular