వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ జరగనుంది. 2019 లో వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ టీమ్ ఈ సంవత్సరం డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి మిగిలిన 4 మ్యాచ్ ల్లో ఓడిపోయి చతికిల పడిపోయింది.ఇక ఇంతకుముందు ఎప్పుడు కూడా వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీమ్ ఇంత దారుణమైన, ఫెలవమైన పర్ఫామెన్స్ ఇవ్వలేదు.ఇక ఆ క్రమం లోనే ఈరోజు ఇండియా ని ఓడించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని దక్కించుకోవాలని ఇంగ్లాండ్ టీమ్ ఆరాటపడుతుంది.
ఇక ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆడిన మ్యాచ్ ల్లో ఆ టీం కన్సీడింగ్ డిఫెన్స్ లోనే ఆడింది అంటే వాళ్లకి వాళ్లు అవతల వాళ్ళకి వాళ్ల మ్యాచ్ ని ఇచ్చేయడం, మేము ఓడిపోతున్నామని ఒప్పుకొని అవతలి టీమ్ కి దాసోహం అవ్వడం లాంటి మ్యాచ్ లను ఆడారు తప్ప మినిమం గెలుపు దాకా మ్యాచ్ ని తీసుకు వచ్చి ఓడిపోయిన మ్యాచ్ లు ఒక్కటి కూడా లేదు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమ్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో… ఇక ఇంగ్లాండ్ ఈరోజు ఆడే మ్యాచ్ లో గెలవడం, కన్విన్సింగ్ గా గెలవడం అనే రెండు ఆప్షన్స్ ను పెట్టుకుంది. నిజానికి ఇంగ్లాండ్ టీమ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇండియన్ టీం మీద గెలవడమే కష్టం అంటే ఇంకా కన్విన్సింగ్ గా గెలవడం అనేది చాలా కష్టం అనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్ లో ఇండియా ఇంగ్లాండ్ ని 2003 వ సంవత్సరంలో ఓడించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్ ని ఒకసారి కూడా ఇండియా ఓడించలేకపోయింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి ఇంగ్లాండ్ ని ఓడించడానికి ఇండియా రెడీ అవుతుంది.ఇక 2003 వ సంవత్సరంలో ఇండియన్ టీం ఇంగ్లాండ్ మీద అద్భుతమైన విక్టరీని సాధించింది. ముఖ్యంగా ఇందులో ఆశిష్ నెహ్ర 23 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక సచిన్ టెండూల్కర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.ముఖ్యంగా ఆడి కాలిక్ బౌలింగ్ లో ఆయన కొట్టిన ఒక షాట్ లో బాల్ వెళ్లి స్టేడియం అవతల పడింది.ఆ షాట్ ఆ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.ఇక సచిన్ కెరియర్ లో ది బెస్ట్ షాట్స్ పదింటిని తీస్తే అందులో ఈ షాట్ కచ్చితంగా నెంబర్ 5 లో చోటు సంపాదించుకుంటుంది. అలాంటి ఒక అద్భుతమైన షాట్ తో సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్ లో అందరిని ఆకట్టుకున్నాడు…
ఇక 2003 వ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మీద గెలిచిన తర్వాత, 2007 లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగలేదు. అలాగే 2011లో ఈ రెండు టీములు మ్యాచ్ ఆడినప్పటికి ఆ మ్యాచ్ డ్రా అయింది. ఇక 2015 వ సంవత్సరంలో కూడా ఇంగ్లాండ్ లీగ్ దశలోనే నిష్క్రమించడం వల్ల ఈ రెండు టీం లకి మ్యాచ్ ఆడే అవకాశం అయితే రాలేదు.ఇక 2019 లో ఇండియా,ఇంగ్లాండ్ టీంలు మ్యాచ్ ఆడినప్పటికీ అందులో ఇండియా ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఆడుతున్న ఈ మ్యాచ్ లో 2003 నాటి విక్టరీ మళ్లీ కొట్టాలని ఇండియా భావిస్తుంది. అయితే ఆ సంవత్సరంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆశిష్ నెహ్ర పాత్రని ఇప్పుడున్న మన బౌలర్లలో ఎవరో ఒకరు పోషించాల్సి ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఇండియన్ టీం లో హార్దిక్ పాండ్యా లేకపోవడం చాలా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీం లో ఉంటే తను హిట్టర్ గా పనిచేస్తాడు, అలాగే ఇండియన్ టీం కి మూడో పేసర్ గా కూడా చాలా వరకు తన సేవలను అందిస్తాడు. కాబట్టి ఆయన టీంలో ఉండడం ఇండియన్ టీమ్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది…ఇక ప్రస్తుతం ఆయన అందుబాటు లో లేడు కాబట్టి ఆయన ప్లేస్ లో మళ్ళీ సూర్య కుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది…ఇక ఇంగ్లాండ్ టీమ్ లో ఏ ఒక్క ప్లేయర్ కూడా ఫామ్ లో లేడు,కానీ ఇండియన్ టీమ్ లో ప్రతి ప్లేయర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు…ఇక ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది…