Vishwak Sen : విశ్వక్ సేన్ సినిమా కంటే కూడా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్. ఫలక్ నుమా దాస్ సమయంలో తన చిత్ర పోస్టర్స్, కట్ అవుట్స్ విజయ్ దేవరకొండ నాశనం చేయించాడని రచ్చ చేశాడు. నాతో తమాషా కాదంటూ వార్నింగ్ లు ఇచ్చాడు. అప్పట్లో ఇది సంచలనమైంది. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్ర ప్రమోషన్స్ కోసం రోడ్డు పక్కన ఓ ఫ్రాంక్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై చర్చలో పాల్గొనేందుకు టీవీ 9 స్టూడియోకి వెళితే… రిపోర్టర్ దేవి నాగవల్లితో లొల్లి అయ్యింది.
ఇక బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ తో ఓ వివాదం నడిచింది. తన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విషయంలో మరో వివాదం రాజేశాడు. విశ్వక్ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టాడు. ‘బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మార్చేద్దామని చూస్తాడు, నేను సినిమా చూడకుండా… ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టిన చేసిన వాడిగా చెబుతున్నా… డిసెంబర్ 8న వస్తున్నా. సినిమా హిట్, ప్లాప్, సూపర్ హిట్, అట్టర్ ప్లాప్ మీ డెసిషన్. తగ్గే కొద్దీ మింగుతారని అర్థం అవుతుంది. అందుకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8న విడుదల కాకపోతే నేను ప్రొమోషన్స్ లో పాల్గొనను’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైంది. సలార్ మూవీ విడుదల డిసెంబర్ 22కి మారడంతో కొన్ని చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. నాని హాయ్ నాన్న ఇదే తేదీకి రావాలని చూశారు. ఆ మూవీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ డిసెంబర్ మొదటివారంలోనే విడుదల ఉంటుందని అంటున్నారు.
గ్యాంగ్స్ గోదావరి చిత్ర విడుదల ఆపాలని, పోస్ట్ ఫోన్ చేయాలని విశ్వక్ సేన్ ని ఎవరో ఒత్తిడి చేశారని అని పోస్ట్ ద్వారా అర్థం అవుతుంది. అది ఎవరు అనేది తెలియదు. విశ్వక్ మాత్రం ఓపెన్ గా కామెంట్ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదారి పీరియాడిక్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. మరి విశ్వక్ అన్న మాట నిలబెట్టుకుని డిసెంబర్ 8న వస్తాడో లేదో చూడాలి…