IND vs BAN T20 World Cup: బంగ్లాపైనే గెలిస్తేనే సెమీస్ కు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

IND vs BAN T20 World Cup: సౌతాఫ్రికాతో ఓటమితో సెమీస్ చేరాల్సిన టీమిండియా ఇప్పుడు పసికూనలతో పోరులో తప్పక నెగ్గాల్సిన దుస్థితికి దిగజారింది. దక్షిణాఫ్రికాతో చేజేతులారా ఫీల్డింగ్ వైఫల్యంతో ఓడి ఇప్పుడు బంగ్లాదేశ్, జింబాబ్వే పై తప్పక గెలవాల్సిన దశకు చేరింది. ఈరోజు బంగ్లాదేశ్ తో కీలకమైన పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలుంటాయి. ఓడితే మాత్రం టీమిండియా కథ ముగిసినట్టే. అందుకే కీలకమైన ఈ పోరు కోసం దేశ క్రికెట్ […]

Written By: NARESH, Updated On : November 2, 2022 10:06 am
Follow us on

IND vs BAN T20 World Cup: సౌతాఫ్రికాతో ఓటమితో సెమీస్ చేరాల్సిన టీమిండియా ఇప్పుడు పసికూనలతో పోరులో తప్పక నెగ్గాల్సిన దుస్థితికి దిగజారింది. దక్షిణాఫ్రికాతో చేజేతులారా ఫీల్డింగ్ వైఫల్యంతో ఓడి ఇప్పుడు బంగ్లాదేశ్, జింబాబ్వే పై తప్పక గెలవాల్సిన దశకు చేరింది. ఈరోజు బంగ్లాదేశ్ తో కీలకమైన పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలుంటాయి. ఓడితే మాత్రం టీమిండియా కథ ముగిసినట్టే. అందుకే కీలకమైన ఈ పోరు కోసం దేశ క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనావేయడానికి లేదు. ఇప్పటిదాకా సరైన పర్ ఫామెన్స్ ఇవ్వకున్నా కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సహా ప్రపంచదేశాలకు షాకిచ్చిన జట్టు అది. తనదైన రోజున ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించగలదు. గ్రూపు దశలో చిన్న జట్లు అయిన స్కాట్లాండ్, నమీబియాలు పెద్ద జట్లు అయిన వెస్టిండీస్, శ్రీలంకలను ఓడించాయి. ఇక పాకిస్తాన్ ను జింబాబ్వే, ఇంగ్లండ్ ను ఐర్లాండ్ ఓడించాయి.

అందుకే టీ20 వరల్డ్ కప్ లో ఏ జట్టును తక్కువగా అంచనావేయడానికి లేదు. అందుకే ఈ కీలక సమరం ఈ మధ్యాహ్నం జరగనుంది. బంగ్లాదేశ్ పై టీమిండియా గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే గాయాల కారణంగా కొందరు.. ఇక టీంలోనూ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్ మధ్యలోనే వెన్నుగాయంతో వైదొలిగిన దినేష్ కార్తీక్ స్థానంలో పంత్ కీపింగ్ చేశాడు. పంత్ ను సీనియర్ ఫినిషర్ దినేష్ కార్తీక్ కోసం ఇన్నాళ్లు పక్కనపెట్టారు. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతూ జట్టుకు భారంగా మారాడు. మరో ఓపెనర్ జట్టులో లేనందున రాహుల్ ఈ మ్యాచ్ లోనూ ఆడొచ్చు. ఈ మేరకు రాహుల్ కు కోచ్ ద్రావిడ్ మద్దతు తెలిపారు. దినేష్ కార్తీక్ గాయం పెద్దది అయితే మాత్రం పంత్ ఈరోజు ఆడొచ్చు. ఇక దీపక్ హుడా స్థానంలో అయినా పంత్ ను ఆడించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇక అశ్విన్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడి స్థానంలో చాహల్ లేదా హర్షల్ పటేల్ ను తీసుకోవచ్చు. అక్షర్ పటేల్ ను తిరిగి జట్టులోకి తీసుకోవచ్చు.

ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిన్న జట్లపై తప్పితే పెద్ద జట్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. కీలక ఆటగాళ్లు లేని వేళ జూనియర్ బంగ్లా దేశ్ పోటీనివ్వడం లేదు. కెప్టెన్ షకిబ్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. భారత్ కనుక ఇప్పుడున్న ఫాం ప్రకారం ఆడితే బంగ్లాను ఓడించడం పెద్ద కష్టం కాదు అని చెప్పొచ్చు.

టీమిండియా ప్లేయింగ్ 11

రోహిత్ (కెప్టెన్), రాహుల్, విరాట్, సూర్యకుమార్, హార్ధిక్, అక్షర్ పటేల్, పంత్ (కీపర్), హర్షల్, భువనేశ్వర్, షమీ, అర్షదీప్ సింగ్