Viral Video : సీసీ కెమెరాలో దెయ్యం.. సోషల్ మీడియాలో వైరల్

ఓ కాలనీలో దెయ్యం సంచరిస్తోంది. అచ్చం సినిమాలో మాదిరిగా చూపించే రూపం కనిపిస్తోంది. ఓ ఇంట్లో అమర్చిన సిసి కెమెరాలో ఈ విషయం బయటపడింది.

Written By: Dharma, Updated On : August 29, 2024 5:47 pm

Ghost In CC camera

Follow us on

Viral Video : సాధారణంగా దెయ్యమంటే చాలామందికి భయం. ఆ మాట వింటేనే భయపడి పోతారు. గజ గజ వణికి పోతారు. అయితే దెయ్యాల విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. దేవుడు ఉన్నాడు ఎంత నిజమో.. దెయ్యం ఉన్న మాట అంతే నిజం అన్నవారు ఉన్నారు.ఇంకా చేతబడి, చిల్లంగిని నమ్మేవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఖమ్మం జిల్లాలో అయితే సీసీ కెమెరాలో దెయ్యం కనిపించింది. ఖమ్మం జిల్లా వైయస్సార్ నగర్ లో హల్చల్ చేసింది. కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దెయ్యం కనిపించిందంటూ మొదలైన ప్రచారం.. కాలనీ మొత్తాన్ని భయం లోకి నెట్టింది. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన సదరు దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఊరు మొత్తం.. దెయ్యం భయంతో వణికి పోతోంది.

* నీడలా వెంటాడుతూ
ఓ నీడలా వెంటాడుతూ కనిపిస్తున్న ఓ చిత్రం సీసీ కెమెరాలో వెలుగు చూసింది. మెట్లను దిగుతూ.. పైకి వెళ్తూ ఆ నీడ కనిపించింది. వీధిలో సైతం అటు ఇటు నీడ తిరిగింది. అచ్చం సినిమాల్లో చూపించే దెయ్యం మాదిరిగానే ఉంది. అది ఖచ్చితంగా దెయ్యమేనని గ్రామస్తులు భయపడుతున్నారు. నెటిజన్లు మాత్రం కొట్టి పారేస్తున్నారు. అది గ్రాఫిక్స్ గా తేల్చేస్తున్నారు.

* ప్రచారం వెనుక
అయితే ఈ ప్రచారం ఉద్దేశపూర్వకంగా చేసిందా? లేకుంటే నిజంగా జరిగిందా? అన్నది మాత్రం తెలియడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. గ్రామస్తుల్లో మరింత భయం నింపుతోంది. అయితే దీనిపై పోలీసులు స్పందించినట్లు తెలుస్తోంది. ఇటువంటి వదంతులను నమ్మవద్దని గ్రామంలో అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం.

* ఇటువంటి సమయంలో భయమా
శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతోంది. సైన్స్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటువంటి సమయంలో దెయ్యం భయం ఏంటని కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో కనిపిస్తున్నది దెయ్యమేకాదని .. మనిషి నీడలా ఉందని.. లైటింగ్ లో అలా వింత ఆకారంలా కనిపించిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఓ చిన్న వీడియో తెగ భయపెట్టిస్తోంది.