India A Vs Oman A: మరికొద్ది గంటల్లో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇండియా, ఒమన్ తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు కచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది . ఇటీవల జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఒమన్ జట్టుతో జరిగే మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యంగా మారిపోయింది.
మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంతలోనే ఒమన్ జట్టు నుంచి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా టీమ్ ఇండియాలో అద్భుతంగా ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ గురించి వారు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 14 సంవత్సరాల వయసులో అత్యంత బలంగా సిక్సర్లు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ ని చూసి వారు ఆశ్చర్యపోతున్నారు.
“ఇది మామూలు విషయం కాదు.. అతడు ఆడుతున్న ఆట తీరు అద్భుతంగా ఉంది.. పక్కా ప్రొఫెషనలిజంతో అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు అనితర సాధ్యంగా ఉంది. 14 సంవత్సరాల వయసులో ఇంతటి పరిణితి అంటే మాటలు కాదు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఇప్పటివరకు వైభవ్ ను కేవలం టీవీలలో మాత్రమే చూసాం. ఈరోజు అతడితో పోటీ పడబోతున్నామని” ఒమన్ ప్లేయర్లు పేర్కొన్నారు.
ప్రస్తుత ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఒక మ్యాచ్లో 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. మరో మ్యాచ్లో 20 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉంటే, ఏకంగా 15 సిక్సర్లు ఉన్నాయి. భీకరంగా బ్యాటింగ్ చేయడంలో వైభవ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాడు. అసలు ఇలా కూడా బ్యాటింగ్ చేయవచ్చా.. అన్నట్టుగా ఇతర ప్లేయర్లకు నిరూపిస్తున్నాడు. వైభవ్ ఆడే ఆట కోసం యావత్ భారత ప్రేక్షకులు మాత్రమే కాదు, ఒమన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒమన్ జట్టుపై వైభవ్ తన తాండవాన్ని చూపిస్తే మాత్రం టీమ్ ఇండియాకు తిరుగుండదు.