Ind W Vs SA W World Cup Final: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. ఎందుకంటే ఈసారి ఫైనల్స్ లోకి భారత్, దక్షిణాఫ్రికా అడుగుపెట్టాయి. వాస్తవానికి ఈ రెండు జట్లు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ అందుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా సరే కొత్త విజేత ఆవిర్భవిస్తుంది. ఫైనల్ దాకా దూసుకు వచ్చిన దక్షిణాఫ్రికా, భారత్ ప్రారంభం నుంచి ఇక్కడి వరకు పోరాట పటిమను చూపించాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది కూడా. వాస్తవానికి వన్డే ఫార్మేట్లో దక్షిణాఫ్రికా కంటే భారత్ మెరుగైనది. కాకపోతే లీగ్ దశలో దక్షిణాఫ్రికా ముందు భారత్ తలవంచక తప్పలేదు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీనే.. కేకే సర్వే సంచలనం!
ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి.. టీ వీల ముందు, ఫోన్ లకు అభిమానులు అతుక్కుపోవడం గ్యారంటీ. పైగా ఫైనల్ మ్యాచ్ మనదేశంలో జరుగుతుంది కాబట్టి.. ఫైనల్లోకి మన జట్టు వెళ్ళింది కాబట్టి సహజంగానే అంచనాలు కూడా భారీగా ఉంటాయి. ఇదే సమయంలో మన జట్టుకు లోకల్ ఫ్యాన్స్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ముంబై మైదానంలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. మహిళల జట్టుకు విపరీతమైన సపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కు ఇదేవిధంగా అభిమానుల నుంచి విపరీతమైన సపోర్ట్ లభిస్తుంది. అది ఒక రకంగా టీమిండియా కు అడ్వాంటేజ్.
లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. కానీ ఆ తప్పును ఫైనల్ మ్యాచ్లో టీమిండియా రిపీట్ కాని వద్దు. ఇక ప్రస్తుత ప్రపంచకప్లో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్డ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆమె 8 మ్యాచ్లలో 470 పరుగులు చేసింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మీద ఏకంగా 169 పరుగులు చేసింది. సఫారి జట్టు బ్యాటింగ్ బలం మొత్తం లారా మీద ఆధారపడి ఉంది. ఆమెను గనుక కట్టడి చేస్తే మిగతా వారిని కంట్రోల్ లోకి తీసుకోవడం పెద్ద కష్టం కాదు.
గ్రూప్ దశలో టీమిండియా బౌలర్ల ధాటికి 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మరోవైపు లారా (70) క్రీజ్ లో ఫెవికాల్ మాదిరిగా అతుక్కుపోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పట్టు సడలించడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్ మీద పట్టు బిగించింది. చివర్లో క్లార్క్ (84), ట్రై యన్(49) దుమ్ము రేపడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురి మీద టీమిండియా కచ్చితంగా దృష్టి సారించాలి. వాస్తవానికి లారా గనక నిలబడకపోయి ఉంటే సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మీద దక్షిణాఫ్రికా 319 పరుగులు చేసి ఉండేది కాదు. వీరిని రేణుక, క్రాంతి కట్టడి చేయాల్సి ఉంటుంది. శ్రీ చరణి, దీప్తి శర్మ, రాధ యాదవ్ అదరగొడితే టీమిండియా కు తిరుగులేదు.
ఇక సఫారీ జట్టులో బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ జట్టులో ప్రధాన పేస్ బౌలర్ కాప్ అద్భుతమైన బంతులు వేస్తుంది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాపార్డర్ మొత్తాన్ని కాప్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏకంగా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. కాప్ మాత్రమే కాకుండా ఖాఖా కూడా అత్యంత డేంజర్ బౌలర్. వీరిద్దరూ దక్షిణాఫ్రికాకు ప్రధాన బలం. మరోవైపు ట్రైయన్ కూడా స్పిన్ బౌలింగ్ లో అదరగొట్టగలుగుతుంది.