Ind Vs UAE Asia Cup 2025: ఆసియా కప్ లో భారత జట్టు బోణి కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆతిధ్య యూఏఈ ని అత్యంత దారుణంగా ఓడించింది. 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని సూర్య సేన సత్తా చాటింది. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ మ్యాచ్ వన్ సైడ్ గా సాగింది. బౌలింగ్లో సూర్య సేన మెరుపులు మెరిపించింది. అనంతరం బ్యాటింగ్ లో కూడా శివతాండవం చేసింది. గడచిన టి20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఆ జట్టుకు ఆతిథ్య యూఏఈ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు.
కొద్దిరోజులుగా టాస్ నెగ్గడంలో విఫలమవుతున్న భారత జట్టుకు.. ఈ మ్యాచ్లో మాత్రం అనుకూల ఫలితం వచ్చింది. సూర్య కుమార్ యాదవ్ టాస్ నెగ్గాడు. మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైందని చెబుతూ బౌలర్లు అదరగొట్టారు. కేవలం 57 పరుగులకే యూఏఈ ని కుప్ప కూల్చారు. ఆతిథ్య జట్టులో షరఫు (22), కెప్టెన్ వసీం (19) మాత్రమే పరవాలేదు అంటించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కుల్దీప్ యాదవ్ ( 4/7) నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. పేస్ బౌలర్ శివం దుబే(3/3) మూడు వికెట్లు దక్కించుకున్నాడు. గుడ్ మార్నింగ్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరి ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు కేవలం 4.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. అత్యంత సులువైన విజయాన్ని సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), గిల్(9 బంతుల్లో 20*), సూర్య కుమార్ యాదవ్ (రెండు బంతుల్లో 7*) అదరగొట్టారు. ఆతిథ్య జట్టు బౌలర్లలో సిద్ధికి ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లతో దూకుడుకు భారత జట్టు 93 బంతులు ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది.. వాస్తవానికి ఇన్నింగ్స్ ప్రారంభాన్ని అభిషేక్ శర్మ సిక్సర్ తో ప్రారంభించాడు. హైదర్ అలీ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని స్టేడియం అవతలికి పంపించాడు. ఆ తర్వాత బంతిని బౌండరీ కొట్టాడు. మిగతా నాలుగు బంతులను డాట్స్ గా ఆడాడు. రెండవ ఓవర్లో గిల్ ఫోర్, సిక్సర్ కొట్టాడు.. తమ్ముడు ఓవర్ లో అభిషేక్ శర్మ వరుసగా 6, 4 కొట్టి దుమ్మురేపాడు. దీంతోలి మూడు ఓవర్లలోనే టీమ్ ఇండియా 38 పరుగులు చేసింది. నాలుగో ఓవర్లో సిక్స్ కొట్టిన శర్మ.. అదే ఊపులో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో తొలివికెట్టుకు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి ఎండ్ కార్డు పడింది. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్ కొట్టాడు. గిల్ ఐదవ ఓవర్ లో మూడవ బంతిని బౌండరీ కొట్టి విజయాన్ని పూర్తి చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత జట్టు వికెట్ కోల్పోకుండా టార్గెట్ ఫినిష్ చేసి ఉంటే 10 వికెట్ల తేడాతో గెలిచి ఉండేది.. తద్వారా వరల్డ్ రికార్డు సొంతం అయ్యేది. బౌలర్లలో ఏకంగా ఐదుగురు వికెట్లు సొంతం చేసుకున్నప్పటికీ.. హార్థిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. ఇది సగటు అభిమానిని ఆందోళనకు గురిచేస్తోంది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసినప్పటికీ.. ఆ జట్టులో తొలుత ఓపెనర్లు దూకుడుగా ఆడారు. వారిద్దరు గనుక కుదురుకొని ఉంటే.. ఆతిధ్య జట్టు స్కోరు భారీగా ఉండేది.
A dominating show with the bat!
A 9⃣-wicket win for #TeamIndia after chasing down the target in 4.3 overs.
Scorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE pic.twitter.com/ruZJ4mvOIV
— BCCI (@BCCI) September 10, 2025