IND Vs SL Shanaka Run Out: శ్రీలంక, టీమ్ ఇండియా మధ్య సూపర్ 4 మ్యాచ్ హోరాహోరిగా సాగింది. 202 పరుగులు చేసినప్పటికీ.. టీమిండియా ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. శ్రీలంక ప్లేయర్లు వీరోచితమైన ఆట తీరు ప్రదర్శించారు. నిస్సాంక ఏకంగా సెంచరీ చేశాడు. కుశాల్ 58 పరుగులతో అదరగొట్టాడు. శనక 22* పరుగులతో ఆకట్టుకున్నాడు.
రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో టీమిండియా అద్భుతమైన ఆట పేరు ప్రదర్శించింది. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమ్ ఇండియా తొలి బంతికే విజయాన్ని అందుకుంది. అంతే కాదు పోయిందనుకున్న మ్యాచ్ ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఓటమి నుంచి గెలుపు అందుకొని ఆసియా కప్ లో లీగ్ నుంచి సూపర్ 4 వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక తదుపరి పాకిస్తాన్ జట్టుతో ఫైనల్ మ్యాచ్లో భారత్ తలపడబోతోంది. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో టీమిండియా, పాకిస్తాన్ పరస్పరం పోటీ పడటం ఇదే తొలిసారి. ఇప్పటికే లీగ్, సూపర్ 4 దశలో పాకిస్తాన్ జట్టుతో తలపడిన భారత్ అద్భుతమైన విజయాలు అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది..
అయితే సూపర్ ఓవర్లో మైదానంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సూపర్ ఓవర్ లో ముందుగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. తొలి బంతికి అర్ష్ దీప్ సింగ్ కుశాల్ ఫెరీరా న ఔట్ చేసి శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో పరుగులు రాలేదు. వైడ్ ద్వారా ఒక పరుగు.. బైస్ ద్వారా మరో పరుగు వచ్చాయి. అయితే బైస్ తీస్తున్న సమయంలో ఫెరీరా రన్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి దాని కంటే ముందుగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. అంపైర్ క్యాచ్ ఔట్ నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించాడు. అయితే ఈ పరిణామాన్ని ముందుగానే గుర్తించిన శ్రీలంక ఆటగాడు షనక అత్యంత తెలివిగా రివ్యూ తీసుకున్నాడు. ఆ బంతి బ్యాట్ కు తగల్లేదు. అంపైర్ నిర్ణయం ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో.. శ్రీలంక ఆటగాడు నాట్ అవుట్ గా మిగిలిపోయాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఎంపైర్ ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే.. ఆ తదుపరి నిర్ణయాన్ని వెల్లడించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అవకాశం ఉన్నా అది చెల్లుబాటు కాదు. వాస్తవానికి ఈ పరిణామంతో మైదానంలో ఉన్న టీం ఇండియా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆటగాళ్లు కూడా ఇదేంటని అంపైర్ ను ప్రశ్నించారు. అంపైర్ అసలు విషయం చెప్పడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు శాంతించారు. ఆ తదుపరి బంతికి షనక ఔట్ అయ్యాడు.
ASIA CUP 2025 PEAKED HERE…!!! pic.twitter.com/5FDcwlwr3v
— Johns. (@CricCrazyJohns) September 27, 2025