IND vs SL : తొలి వన్డే అర్ష్ దీప్ సింగ్ నిర్లక్ష్యం వల్ల టై అయింది. రెండవ వన్డేలో మిడిల్ ఆర్డర్ సత్తా చాటకపోవడంతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో కీలకమైన మూడవ వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీ శ్రీలంక సొంతమవుతుంది. ఒకవేళ భారత్ దక్కించుకుంటే సిరీస్ 1-1 తో సమం అవుతుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి.. కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. మ్యాచ్ ముందు కూడా రోహిత్ శర్మ గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. 110 పరుగుల తేడాతో సిరీస్ శ్రీలంక చేతిలో పెట్టి నిరాశతో వెను తిరిగింది. టి20 సిరీస్ గెలిచిన టీమిండియా, వన్డేలో ఘోర వైఫల్యంతో అపప్రతిష్టను మూటగట్టుకుంది.
కొలంబలోని ప్రేమదాస మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఈడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అవిష్క 96 రన్స్ చేసి… హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టాడు.. సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి తొలి వికెట్ కు నిస్సాంక (45), అవిష్క ఫెర్నాండో కలిసి 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో శ్రీలంక భారీ స్కోర్ చేస్తుందని అందరు అనుకున్నారు. రెండో వికెట్ కు కుషాల్ మెండీస్(59)తో కలిసి ఆవిష్క ఫెర్నాండో 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ దశలో 96 పరుగుల వద్ద ఆవిష్క ఫెర్నాండో రియాన్ పరాగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుశాల్ మెండీస్ కూడా 59 పరుగుల వద్ద కులదీప్ యాదవ్ బౌలింగ్లో గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అసలంక (10), సమర విక్రమ (0), లియానగే(8), దునిత్ వెల్లాలగే(2) విఫలం కావడంతో శ్రీలంక భారీ స్కోర్ చేయలేకపోయింది. చివర్లో కమిందు మెండిస్ (23) దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది..
అనంతరం 249 రన్స్ టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించిన టీమిండియా 138 రన్స్ కే కుప్ప కూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దునిత్ వెల్లాలగే ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. తీక్షణ, వాండర్సే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మైదానం స్పిన్ కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పద్ధతి బంతుల్లో 20 పరుగులు చేసి మెరుగ్గా కనిపించినప్పటికీ.. దునిత్ వేసిన అద్భుతమైన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్(6), రిషబ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), శివం దుబే (9), రియాన్ పరాగ్(15) విఫలమయ్యారు. టీమిండియా 110 రన్స్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (30) ధాటిగా ఆడినప్పటికీ ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. టీమ్ ఇండియా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకుపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ శర్మ మిగతా వారంతా రాణించకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More