Ind Vs Aus 4th T20: వన్డే సిరీస్ కోల్పోయింది. టి20 సిరీస్ లోనైనా సత్తా చూపిస్తుంది అనుకుంటే.. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో దరిద్రమైన బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. మూడో మ్యాచ్లో టీం ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించారు. తద్వారా టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. తద్వారా సిరీస్ ఈక్వల్ అయింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే నాలుగో t20 ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. తద్వారా సిరీస్లో పై చేయి సాధించాలని ఉవిళ్ళూరుతున్నది.
ఇక ఈ మ్యాచ్లో టీమిండియా పెద్దగా మార్పులేమీ చేయడం లేదు. గిల్ కు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంజు ను దూరం పెట్టారు. అతడిని రిజర్వు బెంచ్ కు పరిమితం చేశారు. వాస్తవానికి ఎందుకు అవకాశాలిస్తున్నారనేది అర్థం కావడం లేదు. మరోవైపు అభిషేక్ శర్మ దూసుకుపోతున్నాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దాటిగానే బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ టచ్ లోకి వచ్చాడు. తిలక్ వర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా ప్లేయర్లు కూడా సత్తా చూపిస్తే టీమిండియా కు తిరుగు ఉండదు. అక్షర్ పటేల్ తన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. బౌలింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. శివం దూబే బౌలింగ్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ లోను నిరాశ పరుస్తున్నాడు. కీలకమైన ప్లేయర్లు సరిగా ఆడలేక పోవడంతో.. మిగతా వారి మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి పడుతోంది.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో హెడ్, హేజిల్ వుడ్ లేరు. దీంతో ఇది టీమిండియాకు అడ్వాంటేజ్ గా మారనుంది. ఇద్దరు గొప్ప ప్లేయర్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది.. హెడ్ స్థానంలో షార్ట్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేయబోతున్నాడు. డేవిడ్, మార్ష్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. స్టోయినీస్ కూడా టచ్ లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగ్గురు మీద ఆధారపడి ఉంది. వీరి ముగ్గురిని గనక కట్టడి చేస్తే టీమిండియా కు తిరిగి ఉండదు. ఇటీవల మ్యాచ్ లో దారుణంగా పరుగులు ఇచ్చిన అబాట్ ను ఆస్ట్రేలియా పక్కన పెట్టింది. అతడి స్థానంలో డ్వార్షుయిస్ కు చోటు కల్పించింది.
ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ పై చేయి సాధిస్తుంది. పైగా 2024 t20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. ఆ రికార్డును అలానే పదిలంగా ఉంచుకోవాలంటే టీమిండియా తదుపరి రెండు మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చూపాల్సి ఉంటుంది. అంతేకాదు వన్డే సిరీస్ ఓటమికి గట్టి బదులు తీర్చుకున్నట్టు కూడా ఉంటుంది. అందువల్లే టీమిండియా తదుపరి రెండు మ్యాచ్లలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాలి. విఫలమౌతున్న ఆటగాళ్లు తమ ఆట తీరుని పునరారలోకనం చేసుకొని.. గొప్ప ప్రదర్శన చేయాల్సి ఉంది.