Ind Vs SA 3rd T20: క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లు సాధించే విజయాల పట్ల తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవన్నీ కూడా మెరుగ్గా ఉండాలంటే పిచ్ నుంచి సహకారం లభించాలి. అలా సహకారం లభిస్తేనే మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంటుంది. పిచ్ పరిస్థితి ని అంచనా వేయకుండా బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకుంటే ఆ తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందువల్లే ఒక మ్యాచ్ ఒక జట్టు గెలవాలంటే టాస్ కీలక పాత్ర పోషిస్తే.. ఆ తదుపరి పాత్రను పిచ్ పోషిస్తుందని మాజీ క్రికెటర్లు అంటుంటారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా 5 t20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఆతిధ్య జట్టు.. రెండవ మ్యాచ్ కు వచ్చేసరికి తేలిపోయింది. దీంతో ఆతిధ్య జట్టు బౌలింగ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా వాస్తవానికి బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని.. విపరీతంగా మంచు కురుస్తున్న క్రమంలో బౌలింగ్ ఎంచుకొని టీమిండియా తప్పు చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. రెండో మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగే మూడో మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.
మూడో మ్యాచ్ జరిగే ధర్మశాలలో ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం దాటిన తర్వాత ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. పైగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఇక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సాధారణంగానే ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఇక చలికాలంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. మంచు సాయంత్రం పూట కురుస్తుంది కాబట్టి డ్యూ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
డ్యూ వల్ల బౌలర్లకు ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ వేయడం చాలా కష్టమవుతుంది. బ్యాటర్లకు డ్యూ అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అలాంటప్పుడు బ్యాటర్లు విపరీతంగా పరుగులు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. ధర్మశాలలో ఒకవేళ టీమిండియా టాస్ గెలిస్తే మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకుంటే బాగుంటుంది.. కటక్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. మెరుగైన స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా చేతులెత్తేసింది. రెండో మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బౌలింగ్ చేసి అనుకోని ఓటమిని తెచ్చుకుంది. కటక్ లో డ్యూ అంతగా కనిపించలేదు. కానీ ముల్లాన్ పూర్ లో మాత్రం డ్యూ స్పష్టంగా కనిపించింది. మరోవైపు ధర్మశాలలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ టాస్ గెలిస్తే టీమిండియా సారథి బౌలింగ్ ఎంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు.