IND Vs SA: ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడబోతోంది. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా రెండు టెస్టులు ఆడబోతోంది. తొలి టెస్ట్ ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది. ఈ మైదానం టీమ్ ఇండియాకు అచ్చి వచ్చిందే అయినప్పటికీ.. ఇది అనేక సందర్భాలలో తన భిన్నత్వాన్ని చాటుకుంది. ఈ మైదానం మీద స్పిన్ ను చాటుకోవడానికి బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగని వచ్చి రాగానే స్పిన్నర్లకు సహకరించదు. ఉదయం పూట పేస్ బౌలర్లు సత్తా చూపించడానికి అవకాశం ఉంటుంది. అలాగని బంతి మీద బౌలర్లు గ్రిప్ సాధించకపోతే పిచ్ ఊహించిన విధంగా మారుతుంది. అప్పుడు ఫాస్ట్ బౌలర్లు చెమటలు చిందించాల్సి ఉంటుంది.
ఈడెన్ గార్డెన్స్ లో 2017 లో సురంగ లక్మల్, మాట్ హెన్రీ అద్భుతమైన ప్రదర్శన చేశారు. అలాగని మైదానం మిగతా అడుగుపెట్టగానే వారేమీ అద్భుతాలు చేయలేదు. మైదానాన్ని అర్థం చేసుకొని.. తమ వంతు ప్రదర్శన చేసిన తర్వాత ఊహించని విధంగా పిచ్ వారికి దాసోహం అయింది. ఇక ఇటీవల కాలంలో మహమ్మద్ షమీ ఈ మైదానం మీద రెచ్చిపోయాడు. బెంగాల్ జట్టు తరఫున రంజి ఆడిన అతడు 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు. షమీ మాదిరిగా బంతి మీద గ్రిప్ సాధిస్తే వికెట్లు యధావిధిగా వచ్చేస్తూ ఉంటాయి.
దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల స్పిన్ బౌలింగ్ ద్వారా అద్భుతాలు సృష్టించింది. 2001 నుంచి దక్షిణాఫ్రికా జట్టు అనేక పర్యాయాలు టీమిండియాలో పర్యటించినప్పటికీ రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అవి రెండు కూడా డేల్ స్టెయిన్ ద్వారా లభించాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో బవుమా, కేశవ్ మహారాజ్, ముత్తుస్వామి, సైమన్ హార్మోర్ వంటి వారు కీలకమైన ఆటగాళ్లుగా ఉన్నారు. రబాడ కూడా అదనపు బలంగా ఉన్నాడు. ఈ రెండు జట్లు ఆటగాళ్లపరంగా సమతూ కంతో కనిపిస్తున్నాయి. పైగా దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై గెలిచి విజేతగా నిలిచింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లి ఛాంపియన్ అవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్ ఈ రెండు జట్లకు అత్యంత ముఖ్యమైనది.. అందువల్ల ఈ రెండు జట్లు ఈ సిరీస్లో పోటాపోటీ ప్రదర్శన చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈ మైదానం ప్రారంభంలో పేస్ కు, ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ టాస్ గెలిచిన కెప్టెన్ కచ్చితంగా బౌలింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2019లో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన చివరి టెస్ట్ ఆడింది. 2017లో ఇదే వేదిక మీద శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. టీమిండియాలో రిషబ్ పంత్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.