Gautam Gambhir Trolling: వైజాగ్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. కీలకమైన మూడో వన్డే ఇక్కడ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.. తద్వారా సిరీస్ సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా టెస్ట్ సిరీస్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది.. ఈ మ్యాచ్లో జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ద్వారా జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వైజాగ్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు రకరకాల కార్డులు, ఫ్లెక్సీలతో సందడి చేశారు. వాటికి రకరకాల వ్యాఖ్యానాలు జత చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. వారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నాడని అభిమానుల ప్రధాన ఆరోపణ.. కొన్ని మీడియా సంస్థలు కూడా గౌతమ్ గంభీర్ లక్ష్యంగా చేసుకొని కథనాలను ప్రసారం చేశాయి.
గౌతమ్ గంభీర్ ను తీవ్రస్థాయిలో విమర్శించే రోహిత్, విరాట్ కోహ్లీ అభిమానులు.. వైజాగ్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కూడా అదే ధోరణి కొనసాగించారు. ఈసారి ఏకంగా గౌతమ్ గంభీర్ ను రావణాసురుడితో పోల్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ను రామలక్ష్మణులుగా అభివర్ణించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వారిద్దరూ తమ బ్యాట్ ద్వారా గౌతమ్ గంభీర్ కు సరైన బుద్ధి చెప్పారని.. అభిమానులు ప్లకార్డులలో వ్యాఖ్యానించారు. రోహిత్, విరాట్ బ్యాట్ లు ఎక్కుపెట్టి గౌతమ్ గంభీర్ కు సరైన బుద్ధి చెప్పారని అభిమానులు పేర్కొంటున్నారు.
కొంతకాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు గౌతమ్ గంభీర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్ నుంచి విరాట్, రోహిత్ తప్పుకోవడానికి ప్రధాన కారణం గౌతం గంభీర్ అని అభిమానులు భావిస్తున్నారు. అందువల్లే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.. వైజాగ్ లో జరిగిన మ్యాచ్లో కూడా రోహిత్, విరాట్ అభిమానులు గౌతమ్ గంభీర్ మీద తమకు ఉన్న ఆగ్రహాన్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.