Aaryan Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కుమారుడు, ఆర్యన్ ఖాన్(Aaryan Khan) మరోసారి వివాదం లో చిక్కుకున్నాడు. ఇటీవలే బెంగళూరు లోని ఒక హోటల్ లో దర్శనమిచ్చిన ఆర్యన్ ఖాన్, అక్కడ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అవహేళన చేసాడని ఒక సింగర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ ఉన్న మహిళలకు కూడా ఆర్యన్ ఖాన్ ప్రవర్తన చాలా అసౌకర్యానికి గురి చేసిందని, మిడిల్ ఫింగర్ చూపిస్తూ అతను మహిళల పట్ల ఆస్దభ్యంగా ప్రవర్తించినందుకు అతని పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసు అధికారులు, ఆ హోటల్ లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ని పరిశీలించినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్యన్ ఖాన్ మరోసారి అరెస్ట్ కాబోతున్నాడా? అంటూ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. గతం లో ఆర్యన్ ఖాన్ ని మాలిక ద్రవ్యాలను వినియోగించాడు అనే కేసు లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఒక క్రూజ్ షిప్ లో పార్టీ కి హాజరైన ఆర్యన్ ఖాన్ మాలిక ద్రవ్యాలు సేవించాడు అనే ఆరోపణ క్రింద, పోలీసులు అతన్ని నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించారు. ఈ సంఘటన నుండి పూర్తిగా కోలుకున్న ఆర్యన్ ఖాన్, ఇప్పుడు తన కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. హీరో గా కాకుండా డైరెక్టర్ గా మారి ‘బ్యాడ్ బాయ్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ కూడా ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యం లో పబ్లిక్ లో ఆయన ప్రవర్తన పై ఫిర్యాదు రావడాన్ని చూసి, సోషల్ మీడియా లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎందుకు ఆర్యన్ ఖాన్ విషయం లోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
