India vs Pakistan Asia Cup 2023
India vs Pakistan Asia Cup 2023 : భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందా? అని క్రీడాభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈ రెండు దేశాల క్రీడాకారులు మైదానంలోకి అడుగు పెట్టారంటే టీవీ చూసేవాళ్లలోనూ ఉత్కంఠ నెలకొంటుంది. ఏ జట్టు విజయం సాధించినా చివరి వరకు ఆసక్తిగా ఉంటుంది. ఆసియా కప్-2023 లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలో భారత్, పాక్ తలపడుతోంది. ఇప్పటికే రెండు జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. వీరితో పాటు అభిమానులు సైతం మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ జట్టు గెలవాలని ఆరాటపడుతున్నారు. ఈ తరుణంలో పాకిస్తాన్ ను భయపెట్టే భారత్ బౌలర్ల గురించి చర్చ సాగుతోంది. వీరు క్రీజులోకి దిగారంటే పాక్ బౌలర్లలో దడ పుడుతుంది అని అంటున్నారు. మరి వాళ్లెవరో తెలుసుకుందామా..
భారత్ జట్టు తరఫున ఆడే ప్రతి క్రీడాకారుడు పాకిస్తాన్ పై గెలవాలనే కోరుకుంటాడు. కొందరు కేవలం ఆటలా కాకుండా యుద్ధంలా భావించి రంగంలోకి దిగుతారు. వీరి ఎమోషన్ చూసి ఆడియన్స్ మరింత ఉత్కంఠలోకి వెళ్తారు. ఈ తరుణంలో భారత్ జట్టులో కీలక ఆటగాడిగా మారిన విరాట్ కోహ్లి మరింత దూకుడుగా ఆడుతాడనే పేరుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ పై కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు పాక్ తో ఆడిన 13 ఇన్నింగ్స్ ల్లో 48.73 సగటుతో కోహ్లి 536 పరుగులు చేశారు. వన్డే ఫార్మాట్లో కోహ్లిని అడ్డుకోవాలంటే పాక్ కు కష్టతరమైన పనేనని క్రీడా లోకం చర్చించుకుంటుంది.
భారత్ కు చెందిన మరో దూకుడు క్రీడాకారుడు హార్థిక్ పాండ్యా అన్నా పాక్ బౌలర్లకు దడ పుడుతుంది అని అంటున్నారు. పాక్ పై హార్దిక్ పాండ్యా ఆడింది మూడు ఇన్నింగ్సులే. కానీ వన్డేల్లో పాండ్యా జోరు పెంచాడు. ఇప్పటి వరకు హార్థిక్ పాండ్యా 61 సగటు, 179 స్ట్రైక్ రేటుతో 122 పరుగులు చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కూడా పాక్ పై భారత్ ను గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేసిన రోజులు ఎవరూ మర్చిపోరు. దీంతో పాండ్యా రంగంలోకి దిగితే ఎలా అడ్డుకోవాలి? అనే దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
టీమిండియాకు కుల్దీప్ యాదవ్ కీలకంగా మారాడు. జట్టులో ఆయన రీ ఎంట్రీ తరువాత అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది కాలంలో 15 మ్యాచుల్లో 29 వికెట్లు తీసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో పామ్ లోకి వచ్చాడు. పాక్ కెప్టెన్, నెంబర్ వన్ బ్యాటర్ అయిన బాబర్ నే ముప్పు తిప్పలు పెట్టాడు. ఇప్పటి వరకు కుల్దీప్ పాక్ పై వేసిన బౌల్స్ లో బాబర్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కుల్దీప్ పై కూడా పాక్ జట్టు ఫోకస్ పెట్టింది.