IND vs PAK: క్రికెట్లో ఒకప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే హై వోల్టేజ్ గా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ – పాకిస్తాన్ ఆక్రమించాయి. భారత్ – పాకిస్తాన్ మధ్య సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు.. రాజకీయ ఉద్రిక్తతలు.. అంతిమంగా ఈ రెండు జట్ల మధ్య వాతావరణాన్ని వేడెక్కించాయి. పైగా ఆటగాళ్లలో కూడా గెలవాలి అనే కసి ఉండటంవల్ల.. భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. అందువల్లే ఐసీసీ తను నిర్వహించే ప్రతి టోర్నీ లోను భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉండేలాగా చూస్తుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ హై వోల్టేజ్ సమరంగా మారింది.. ఐసీసీ నిర్వహించే ప్రతి టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించడానికి ప్రధాన కారణం అత్యధికంగా రెవెన్యూ రావడమే. ఒక అంచనా ప్రకారం భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఐసీసీకి 10,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ప్రకటనలు, శాటిలైట్ హక్కులు, ఇతర వాటి ద్వారా ఐసీసీకి భారీగా రెవెన్యూ వస్తుంది. అందువల్లే భారత్ – పాకిస్తాన్ మధ్య ఐసీసీ తను నిర్వహించే టోర్నీలో కనీసం ఒకటైన మ్యాచ్ ఉండేలాగా చూస్తుంది.
2017లో..
2017 లో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా – పాకిస్తాన్ లీగ్ దశలో పోటీపడ్డాయి. అప్పుడు భారత్ గెలిచింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్ వెళ్లాయి. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది. తద్వారా 2017 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ దక్కించుకుంది.. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని ఒకవేళ భారత్ గనుక గెలుచుకుని ఉంటే ఐసీసీకి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చి ఉండేది. ఎందుకంటే భారత్ అనుకూలంగా వందలాది కార్పొరేట్ కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. స్పాన్సర్ గా చాలా కంపెనీలు వ్యవహరిస్తుంటాయి. పాకిస్తాన్ గెలవడం వల్ల భారతీయ కంపెనీలు ముందుకు రాలేదు. ద్వారా ఐసీసీకి అంతగా రెవెన్యూ రాలేదు.. ఇక 2023 వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుపై భారత్ గెలిచింది. అప్పుడు ఊహించని విధంగా ఐసీసీకి ఆదాయం వచ్చింది. ఇప్పుడు అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ గెలిచేలాగా ఉంది. దీంతో ఐసీసీ యాడ్ రెవెన్యూ రూపంలో పండగ చేసుకుంటున్నది. నిమిషం యాడ్ కు కోటలో వసూలు చేస్తున్నది.. లైవ్ టెలికాస్ట్ హక్కుల ద్వారా ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నది.