spot_img
Homeక్రీడలుక్రికెట్‌IND vs PAK: దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK: దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK: అసలే ప్రత్యర్థి పాకిస్తాన్. హై టెన్షన్ మ్యాచ్. ఇండియా గెలుపు మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. దీంతో ఒక రకంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ప్రారంభంలోనే టీమ్ ఇండియా రెండు వికెట్ల కోల్పోయింది. స్మృతి, కౌర్ నిలబడకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది.. అప్పటికి టీమ్ ఇండియా 170 పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఈ పరుగులను సాధించడానికి తన ఇన్నింగ్స్ ను బలంగా మొదలుపెట్టింది. ఓవర్ కు 8 పరుగులకు పైగా చొప్పున తీయడం ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గెలుపు సాధ్యమని అనుకున్నారు. మరోవైపు మునిబా అదరగొట్టే స్థాయిలో బ్యాటింగ్ చేస్తోంది. అరుంధతి రెడ్డి ధారాళంగా పరుగులు ఇస్తోంది.. క్రాంతి గౌడ్ కూడా ఒక్క ఓవర్ లోనే 14 పరుగులు ఇచ్చింది. అప్పటికి టీమ్ ఇండియా మీద ఒత్తిడి పెరిగిపోతోంది. రెండు వికెట్లు పడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ దశలో కౌర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ధైర్యం చేసింది దీప్తికి బంతి ఇచ్చింది.. ఇక అప్పుడు మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దీప్తి ఏమాత్రం వమ్ము చేసుకోలేదు. తొలి ఓవర్ లో ఒక వికెట్.. రెండవ ఓవర్ లో మరొక వికెట్.. చివరి నాలుగో ఓవర్ లో మూడు వికెట్లు సాధించి మొత్తంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తనను లేడీ బుమ్రా అని ఎందుకు పిలుస్తారో మరోసారి దీప్తి నిరూపించుకుంది.

దీప్తి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి సత్తా చూపించింది. అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేస్తూ అదరగొట్టింది.. ఏకంగా మూడు వికెట్లను దక్కించుకుంది. దీప్తి శర్మ పాకిస్తాన్ పతనాన్ని ప్రారంభిస్తే.. శ్రీ చరణి పాకిస్తాన్ మొత్తాన్ని తగలబెట్టేసింది.. ఉక్కిరి బిక్కిరి చేసే బంతులతో పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం పరుగులు తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచింది. ఒక ఎండ్ నుంచి దీప్తి.. మరో ఎండ్ నుంచి శ్రీ చరణి దాడి చేయడంతో పాకిస్తాన్ కు ఏ మాత్రం కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఆ మధ్య టీం ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు.. శ్రీ చరణి సత్తా చూపించింది. తన బౌలింగ్ వైవిధ్యంతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి అందించింది. ఉద్యోగంతో పాటు.. ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసింది. నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. నాటి కార్యక్రమంలో మిథాలీ రాజ్ కూడా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular