IND vs NZ : దుబాయ్ మైదానం స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో రెండు జట్లు నలుగురు స్పిన్ బౌలర్లతో రంగంలోకి దిగుతాయని క్రిక్ బజ్ పేర్కొంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కు రూపొందించిన పిచ్ నే.. న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ కు రూపొందిస్తున్నామని దుబాయ్ మైదానం క్యూరేటర్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా మైదానాన్ని ఆయన నిత్యం పరిశీలిస్తున్నారు.. పిచ్ పై తేమను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రాస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మైదానంపై ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో స్పిన్ బౌలర్లు కీలకపాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్ లోను స్పిన్ బౌలర్లే ముఖ్య భూమిక పోషిస్తారని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని.. టైటిల్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడుతాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : ఫైనల్ మ్యాచ్ లోనూ స్పిన్నర్లదే హవా.. ఎంత తిప్పితే అంతలా విజయం!
టీమిండియా బ్యాటర్ కు గాయం
దుబాయ్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ ఇండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ గాయపడ్డాడని తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్లో పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లీ మోకాలికి గాయమైందని తెలుస్తోంది. దీంతో వెంటనే అతడు తన ట్రైనింగ్ ఆపేశాడని.. జట్టు ఫిజియో రంగంలోకి దిగి స్ప్రే కొట్టాడని.. గాయం అయినచోట బ్యాండేజ్ చేశాడని తెలుస్తోంది. గాయమైనప్పటికీ విరాట్ కోహ్లీ త్వరగానే కోలుకున్నాడని.. అతడు ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. “ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. అయితే అది పెద్ద గాయం కాదు. పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఇంతలోనే అతని మోకాలికి గాయమైంది. వెంటనే ప్రాక్టీస్ ఆపేశాడు. జట్టు ఫిజియో వచ్చి గాయం అయినచోట స్ప్రే చేసి.. బ్యాండేజ్ వేసాడు. కొంతసేపటి తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే ప్రాక్టీస్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడని” జియో న్యూస్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లోను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు.
Also Read :న్యూజిలాండ్ జట్టును ఆడిపోసుకుంటున్నాం గానీ.. అది కూడా బాధిత జట్టే..