https://oktelugu.com/

IND vs NZ : న్యూజిలాండ్ జట్టును ఆడిపోసుకుంటున్నాం గానీ.. అది కూడా బాధిత జట్టే..

IND vs NZ : 2000 సంవత్సరంలో నాకౌట్ టోర్నీ కప్ ను మనకు దూరం చేసింది. 2019లో వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఓడించింది. 2019 -21 కాలంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ మట్టికరిపించింది. గత ఏడాది అక్టోబర్ - నవంబర్ కాలంలో జరిగిన మూడు టెస్టులలో భారత జట్టును 0-3 తేడాతో ఓడించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 7, 2025 / 09:08 AM IST
    IND vs NZ

    IND vs NZ

    Follow us on

    IND vs NZ : ఇలా చెప్పుకుంటూ పోతే న్యూజిలాండ్ జట్టు టీమిండియా కు ఎన్నో పరాభవాలను మిగిల్చింది. అశేషమైన టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్తలను అందించింది. అందువల్లే న్యూజిలాండ్ అంటే టీమిండియా అభిమానులు మండిపడుతుంటారు. ఆస్ట్రేలియా కంటే ఎక్కువ తిడుతుంటారు.. వాస్తవానికి క్రికెట్లో స్పోర్టివ్ నెస్ ఉండాలి.. కానీ టీమిండియా అభిమానులు తమ జట్టుకు ఏదైనా ఓటమి ఎదురైతే.. తట్టుకోలేరు. ఆ సమయంలో స్పోర్టివ్నెస్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. వారికి అంతిమంగా కావాల్సింది టీమిండియా గెలవడం.. టీమిండియా ట్రోఫీలు అందుకోవడం.. టీమిండియా క్రికెట్లో సగర్వంగా నిలవడం.. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరుకుంది. న్యూజిలాండ్ కూడా దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ఫైనల్ చేరుకుంది. అయితే ఇక్కడ న్యూజిలాండ్ ఫైనల్ రావడం తో భారతీయ క్రికెట్ అభిమానుల్లో ఎక్కడో చిన్న ఆందోళన ఉంది. 2000 సంవత్సరం నాటి దురదృష్టం మళ్ళీ వెంటాడుతుందనే భయం ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టు విలక్షణమైనదే కావచ్చు. విభిన్నమైన క్రికెట్ ఆడే జట్టు కావచ్చు. కాకపోతే అది కూడా బాధిత దేశమే.

    Also Read : న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు.. రోహిత్ సేన ఈ తప్పులు చేయొద్దు..

    ఓటములు ఎదుర్కొంది

    2023 వన్డే వరల్డ్ కప్ లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ఇది సగటు భారత క్రికెట్ అభిమానికి ఇబ్బంది కలిగించింది. కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. అయితే ఇలాంటి సందర్భాలను న్యూజిలాండ్ జట్టు చాలాసార్లు ఎదుర్కొంది. 2000 సంవత్సరంలో టీమిండియా పై ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజిలాండ్.. 2009లో ఛాంపియన్ ట్రోఫీ ని గెలుచుకునే దశ దాకా వచ్చిన న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నీలో న్యూజిలాండ్ జట్టుపై అభిమానులకు భారీగా ఆశలు ఉండేవి. చివరి అంచెలో న్యూజిలాండ్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ఇక 2017 వన్డే వరల్డ్ కప్ లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా జట్టు చేతిలో భంగపాటుకు గురైంది. ఫలితంగా వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సొంతమైంది. ఇక 2019లోనూ న్యూజిలాండ్ జట్టు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ చేరుకుంది. అయితే ఈసారి ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ భంగపాటుకు గురైంది. కీలకమైన దశలో చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. తద్వారా న్యూజిలాండ్ జట్టుకు మరోసారి నిరాశ ఎదురయింది. ఇలా ఏకంగా మూడుసార్లు ఐసీసీ కీలకటోర్నీలలో ఓడిపోవడం న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా నిరాశను కలిగించింది. గణాంకాలు ఇలా ఉన్నాయి కాబట్టే చాలామంది న్యూజిలాండ్ జట్టును పక్కలో బల్లెం, తేనె పూసిన కత్తి అని కాకుండా.. బాధిత క్రికెట్ జట్టు అని వ్యాఖ్యానిస్తున్నారు.

    Also Read : లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం