IND Vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ ( IND vs NZ) ఆదివారం దుబాయ్ లో తలపడనున్నాయి. గ్రూప్ – ఏ లో ఉన్న ఈ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడతాయి. దుబాయ్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతుంది.. ఈ రెండు జట్లు ఇప్పటికే చెరి రెండు విజయాలతో సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు గ్రూపు – ఏ లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. అందువల్ల ఈ రెండు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ కంటే ముందు న్యూజిలాండ్, భారత్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. అవి టీమిండియా అభిమానులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు అప్పర్ హ్యాండ్ గా ఉంది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం న్యూజిలాండ్ జట్టుకు రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. అయితే గడిచిన 20 సంవత్సరాల లో నిర్వహించిన ఐసిసి టోర్నీలలో టీమిండియా పై న్యూజిలాండ్ జట్టు అప్పర్హ్యాండ్ కొనసాగిస్తోంది. 2019 వన్డే ప్రపంచ సెమి ఫైనల్, 2021 t20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ (ఛాంపియన్ ట్రోఫీ) ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు భారత్ ను మట్టి కరిపించింది.. ఇది మాత్రమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ ఎడిషన్ లోనూ భారత జట్టును న్యూజిలాండ్ ఓడించింది. మొత్తంగా చూస్తే రెండు జట్ల మధ్య ఐసీసీ టోర్నీలలో 16 మ్యాచులు జరిగాయి. న్యూజిలాండ్ 10 మ్యాచ్లలో విజయం సాధించింది. భారత్ కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే గెలుపును సొంతం చేసుకుంది. ఇంకో మ్యాచ్లో ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచ కప్ లలో 11సార్లు, టి20 ప్రపంచ కప్ లలో మూడుసార్లు, ఛాంపియన్స్(నాకౌట్) ట్రోఫీ, ఐసీసీ చాంపియన్ ట్రోఫీ లో భారత్ – న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇక 2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచింది. అయితే లీక్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2016 టి20 ప్రపంచ కప్ లో సూపర్ -10 మ్యాచ్ లో భారత్ పై న్యూజిలాండ్ గెలిచింది. 2021 t20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో న్యూజిలాండ్ భారత జట్టుపై గెలుపును సొంతం చేసుకుంది.
ఇటీవల టెస్ట్ సిరీస్ లోనూ..
గత ఏడాది భారత వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు టెస్టుల్లోనూ విజయం సాధించి భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను మూసివేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా దారుణమైన వైఫల్యాన్ని కొనసాగించడంతో.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కోల్పోయింది. ఈ ఏడాది లార్డ్స్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా తలపడతాయి. ప్రారంభ ఎడిషన్లో న్యూజిలాండ్ భారత్ పై విజయం సాధించగా.. రెండవ ఎడిషన్ లో టీమిండియా పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. అయితే ఈసారి టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లలేదు. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.
Also Read: ఇంగ్లాండ్ మీదే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే.