Ind vs NZ match: న్యూజిలాండ్ పై భారత్ గెలవాలంటే అది జరగాలి

Ind vs NZ match: సాధారణంగా బలాబలాలను బట్టి జట్లు గెలుస్తుంటాయి. ఎవరు ఎక్కువగా ఆడిదే వారిదే విజయం. గట్టిగా పరుగులు చేసిన వారు క్రికెట్ లో గెలుస్తారు.. చేయని వారు ఓడుతారు. కానీ ఈ ఇసుక దేశాల్లో మాత్రం ‘టాస్ గెలిచిన వారే ’ గెలుస్తున్నారు. మొదట ఫీల్డింగ్ చేసిన జట్టు విజయం సాధిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం చాప చుట్టేసి ఓడిపోతోంది. మొన్నటి పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి […]

Written By: NARESH, Updated On : October 30, 2021 3:51 pm
Follow us on

Ind vs NZ match: సాధారణంగా బలాబలాలను బట్టి జట్లు గెలుస్తుంటాయి. ఎవరు ఎక్కువగా ఆడిదే వారిదే విజయం. గట్టిగా పరుగులు చేసిన వారు క్రికెట్ లో గెలుస్తారు.. చేయని వారు ఓడుతారు. కానీ ఈ ఇసుక దేశాల్లో మాత్రం ‘టాస్ గెలిచిన వారే ’ గెలుస్తున్నారు. మొదట ఫీల్డింగ్ చేసిన జట్టు విజయం సాధిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం చాప చుట్టేసి ఓడిపోతోంది.

india vs new zealeand

మొన్నటి పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. పాక్ బౌలర్ల ధాటికి కుదేలై వికెట్లు కోల్పోయి ఓడింది.ఇదేపిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు పాక్ ఓపెనర్లు దంచి కొట్టి ఆ జట్టును గెలిపించారు. దీన్ని బట్టి టాస్ ఎంత కీలకమో అర్థమవుతోంది.

యూఏఈ, షార్జాలో మొత్తం ఇసుక పిచ్ లు. అక్కడ బంతి బౌన్స్ కాదు. రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు మంచు తేమ ప్రభావంతో బౌలర్లకు గ్రిప్ లేక పిచ్ పై జీవం లేక ఓడిపోతున్నారు. గత ఐపీఎల్ లోనూ అదే జరిగింది. అంతకుముందు మ్యాచ్ లలోనూ అదే కొనసాగింది.

భారత్ పాకిస్తాన్ మ్యాచ్ యే కాదు.. నిన్న జరిగిన అప్ఘనిస్తాన్-పాకిస్తాన్ మ్యాచ్ లోనూ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసిన జట్టే గెలిచింది.

ఇప్పుడు ఆదివారం న్యూజిలాండ్ తో ఇదే దుబాయ్ స్టేడియంలో టీమిండియా తలపడబోతోంది. ఈ మ్యాచ్ భారత్ కు చావోరేవో.. గెలిస్తే సెమీస్ కు.. ఓడితే ఇంటికి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో టాస్ కీలకం. అది ఎటుపడుతుంది? ఎవరు గెలుస్తారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రతీసారి టాస్ ఓడిపోయే టీమిండియా కెప్టెన్ కోహ్లీని చూసి ఇప్పుడు అభిమానులు కలత చెందుతున్నారు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.