IND vs NZ: AI prediction : గతంలో ఏదైనా మేజర్ టోర్నీ జరిగినప్పుడు.. రెండు బలమైన జట్లు ఫైనల్లోకి వెళ్లినప్పుడు.. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న మదిలో మిగిలినప్పుడు.. క్రికెట్ విశ్లేషకులను సంప్రదించేవారు. ఆ తర్వాత కొంతకాలానికి సెఫాలజిస్టులను ఆశ్రయించేవారు. కొంతకాలం అనంతరం గూగుల్ ప్రిడిక్షన్ బాట పట్టారు. అది చెప్పిన ఫలితాన్ని నమ్ముకునేవారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పాతవి అయిపోయాయి. స్మార్ట్ కాలంలో .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న సమయంలో.. దాని ఆధారంగానే మ్యాచ్ ఫలితాలను నమ్మే రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ పని కూడా ముందుకు సాగడం లేదు. విషయంలోనూ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగింది. అయితే దీని ఆధారంగా గూగుల్ జెమిని, ఓపెన్ చాట్ జిపిటి, మైక్రోసాఫ్ట్ కాపీలాట్ వంటివి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా- న్యూజిలాండ్ ఫైనల్ వెళ్లిపోయాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ను ప్రశ్నించగా.. టీమిండియా వైపు మొగ్గు చూపించాయి. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్లో విజేతను అంచనా వేయలేమని చైనా తయారుచేసిన డీప్ సీక్ పేర్కొంది.
Also Read : CT ఫైనల్ రేపే.. విరాట్ కోహ్లీకి గాయం.. ఫైనల్ మ్యాచ్ లో ఆడతాడా?
టీమిండియా అనే విజేత ఎందుకంటే..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఎందుకు విజేతగా నిలుస్తుందని గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కాపీలాట్, ఓపెన్ చాట్ జిపిటి ని ప్రశ్నించగా..” 2000 సంవత్సరంలో జరిగిన నాకౌట్ టోర్నీలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2021 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇక ఇటీవల భారత్ వేదికగా జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 0-3 తేడాతో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇన్ని రకాల ఓటములకు న్యూజిలాండ్ కారణం. అందువల్ల టీమిండియా ఈసారి బలంగా ఆడుతుంది. గతంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఆడుతుంది. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్ దాకా వచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను టీం ఇండియా ఓడించింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. టీమిండియాలో మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎక్కువ ప్రతిభ కలిగి ఉన్నవాళ్లు. శరీర సామర్థ్యం మెరుగ్గా ఉన్న వాళ్ళు. అందువల్లే టీమిండియా ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించగలుగుతుంది. టీమిండియా ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోందని” చాట్ బాట్స్ పేర్కొన్నాయి. అయితే టీమిండియా విజయం సాధించినప్పటికీ.. న్యూజిలాండ్ అంత సులువుగా వదిలిపెట్టదని క్రికెట్ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ – భారత్ తలపడుతున్న నేపథ్యంలో.. టీమిండియా కు విన్నింగ్ పర్సంటేజ్ 69, న్యూజిలాండ్ కు 31 శాతం గూగుల్ ప్రిడిక్షన్ లో పేర్కొనడం విశేషం.