Ind Vs NZ 2nd T20: టి20 క్రికెట్లో పరుగుల వరద కామన్. కానీ, కొంతమంది బౌలర్లు బౌలింగ్ వేస్తుంటే.. పరుగుల వరద సాధ్యం కాదు. ఎందుకంటే వారు కట్టుదిట్టంగా బంతులు వేస్తుంటారు. పైగా వికెట్లు తీసే విషయంలో అత్యంత నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ జాబితాలో అర్ష్ దీప్ సింగ్ ముందు వరుసలో ఉంటాడు. కానీ, న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో అర్ష్ దీప్ సింగ్ తేలిపోతున్నాడు. వికెట్లు తీయడం పక్కన పెడితే.. కనీసం పదునైన బంతులు కూడా వేయలేకపోతున్నాడు. పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తున్నాడు. తొలి టి20 మ్యాచ్ లో నాలుగో ఓవర్లు వేసిన అర్ష్ దీప్ సింగ్.. 31 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే తీశాడు.
రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో టి20లో అర్ష్ దీప్ సింగ్ పూర్తిగా తేలిపోయాడు. దారుణంగా పరుగులు ఇచ్చాడు. తొలి ఓవర్లో ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని ఫుల్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ గా వేశాడు. ఆ బంతిని కాన్వే వదిలేశాడు. రెండవ బంతి ని కాన్వే ఫోర్ కొట్టాడు. మూడో బంతిని కూడా కాన్వే బౌండరీ వైపు తరలించాడు. నాలుగో బంతికి పరుగులు రాలేదు. ఇక ఐదవ బంతికి కాన్వే సిక్సర్ కొట్టాడు. ఆరో బంతిని ఫోర్ గా మలిచాడు. తద్వారా తొలి ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 18 పరుగులు చేసింది.
మూడో ఓవర్ లో కూడా అర్ష్ దీప్ సింగ్ దారుణంగా పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్ సీఫెర్ట్ అదరగొట్టాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ తీసుకున్న అనంతరం..సీఫెర్ట్ అదరగొట్టాడు. వరుసగా నాలుగు బంతులను నాలుగు ఫోర్లు గా మలచాడు. ఈ ఓవర్ లో కూడా అర్ష్ దీప్ సింగ్ 18 పరుగులు ఇచ్చాడు. తద్వారా మూడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు ఏకంగా 43 పరుగులు చేసింది. ఈ దశలో హర్షిత్ రానా నాలుగో ఓవర్ లో బంతిని అనుకున్నాడు. రెండవ బంతికి ప్రమాదకరమైన కాన్వే ను అవుట్ చేశాడు. నీతో న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ భాగస్వామ్యం 43 పరుగుల వద్ద ముగిసింది. హర్షిత్ వికెట్ తీయడం మాత్రమే కాదు.. మెయిడ్ ఇన్ ఓవర్ వేశాడు. ఆ తదుపరి వరుణ్ చక్రవర్తి బంతిని అందుకున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన రెండో బంతికి సీఫెర్ట్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సీఫెర్ట్(24) ఔట్ అయ్యాడు.
అర్ష్ దీప్ సింగ్ దారుణంగా పరుగులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో విమర్శలు సర్కులేట్ అవుతున్నాయి. అర్ష్ దీప్ సింగ్ ఇలా బౌలింగ్ వేయడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. టి20 వరల్డ్ కప్ ముందు ఇలాంటి ప్రదర్శన చేస్తే పరిస్థితి ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.