Homeక్రీడలుక్రికెట్‌IND Vs ENG: సచిన్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇండియన్...

IND Vs ENG: సచిన్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెటర్ గా సరికొత్త చరిత్ర..

IND Vs ENG: ఈ అరుదైన ఘనతను అందుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ 4వేలకు పైగా పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 3990 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ మాత్రమే కాదు.. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి జట్లపై అంతర్జాతీయ క్రికెట్లో 3 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుపై ఐదువేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ జట్టు పై నాలుగు వేలకు పైగా పరుగులు, సౌత్ ఆఫ్రికా పై 3 వేలకు పైగా పరుగులు చేశాడు.. అంతర్జాతీయ క్రికెట్ లో మూడు దేశాలపై ఈ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ.. రికి పాంటింగ్ రికార్డును సమన్ చేశాడు.

విరాట్ కోహ్లీ, పాంటింగ్ చెరి మూడు దేశాలపై 4 వేలకు పైగా చేశారు. సచిన్ టెండూల్కర్ రెండు దేశాలపై ఈ ఘనతను అందుకున్నాడు. ఆసియాలో మూడు ఫార్మేట్ లలో కలిపి అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ టెండుల్కర్ 353 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 340 ఇన్నింగ్స్ లలో నే ఈ రికార్డు సృష్టించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆరు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్ ను భారత్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్(112), విరాట్ కోహ్లీ (52) రెండో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (78) పరుగులు చేసి ఆది రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు , కేఎల్ రాహుల్ (18*), అక్షర్ పటేల్ (5*) క్రీజ్ లో ఉన్నారు. హార్థిక్ పాండ్యా 18 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో వెను తిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 42.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular