IND vs ENG 4th Test : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ ఒక్కసారిగా భారత్ చేతిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగో టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలిన బెన్ స్టోక్స్ సేన రోహిత్ సేన ముందు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. ధోని ఇలాఖాలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆదివారం ఒక్కరోజే 13 వికెట్లు నేలకులాయి. ఇందులో ఇరు జట్లకు సంబంధించిన స్పిన్నర్లు పడగొట్టినవే 12 వికెట్ల దాకా ఉంటాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడి మైదానం ఎలా రూపాంతరం చెందిందో. క్యూరేటర్ చెప్పినట్టు ఈ మైదానంపై ఏర్పడిన పగుళ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి. దీంతో వారు బంతిని తమదైన శైలిలో తిప్పుతూ పండగ చేసుకుంటున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టును రవీంద్ర జడేజా ఇబ్బంది పెట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ వణికించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో బషీర్ ఎంతటి ప్రభావం చూపించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ బ్యాటర్లు కనీసం బషీర్ వేసిన బంతులను బ్యాట్ తో టచ్ చేయడానికే భయపడ్డారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు కులదీప్ ఎలాంటి దమ్కీ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మైదానంపై 192 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడం కుదురుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
మన దేశంలో క్రికెట్ మైదానాలు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. టెస్టుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతి తిరిగే గింగిరాలకు స్పిన్ పట్ల అవగాహన ఉన్న ఎంత గొప్ప బ్యాటర్ అయినప్పటికీ బోల్తా పడాల్సిందే. రాంచి టెస్టులో సోమవారం జరిగే తొలి సెషన్ భారత జట్టుకు అత్యంత కీలకం. జరిగిన మూడు రోజుల ఆటను పరిశీలిస్తే.. రెండు జట్లు ఎక్కువ వికెట్లు కోల్పోయింది ఉదయం సెషన్ లోనే. తొలి రోజు ఇంగ్లాండు జట్టును ఆకాశ దెబ్బ కొట్టాడు. మూడోరోజు ధృవ్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ చేసిన 353 పార్కుల్లో వైపు వెళ్తున్న భారత జట్టును ఇంగ్లీష్ బౌలర్లు దెబ్బతీసింది కూడా ఉదయం సెషన్ లోనే కావడం విశేషం.
నాలుగు రోజు ఆటల్ తొలి సెషన్ అత్యంత కీలకం కానుంది. టార్గెట్ మరీ అంత పెద్దది కాకపోయినప్పటికీ వికెట్లు కాపాడుకోవడం భారత జట్టుకు అత్యంత ముఖ్యం. మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బషీర్, హార్ట్ లీ మైదానంపై ఉన్న పగుళ్లను, ఉదయం పూట తేమను ఉపయోగించుకొని వెంట వెంటనే వికెట్లు తీస్తే భారత జట్టు కచ్చితంగా ఒత్తిడిలోకి వెళ్తుంది.. భారత జట్టులో ప్రస్తుతం రోహిత్, గిల్, జడేజా, అశ్విన్ మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. సర్ఫ రాజ్, రజత్ పాటి దార్, ధృవ్ జురెల్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఓనమాలు దిద్దుతున్నారు. ఒకవేళ భారత్ ఇంగ్లాండ్ స్పిన్నర్ ల వల్ల వికెట్లు కోల్పోతే.. యువ ఆటగాళ్లపై భారం పడుతుంది . 192 పరుగుల విజయ లక్ష్యానికి సంబంధించి భారత్ ఇప్పటికే 40 రన్స్ పూర్తి చేసింది . ఇంకా 152 పరుగులు చేస్తే భారత్ వశం అవుతుంది.
ధోని ఇలాఖాలో 2013లో రాంచీ మైదానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ మైదానం లో భారత్ మూడు టెస్టులు మాత్రమే ఆడింది. 2017 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ను భారత్ ఇన్నింగ్స్ 202 పరుగులతో గెలిచింది. దేశవాళీ ప్రకారం చూసుకుంటే.. ఇక్కడ రెండుసార్లు మాత్రమే 200 పై చిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. 20 లో ఉత్తరాఖండ్ జట్టు నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని జార్ఖండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2016లో హిమాచల్ ప్రదేశ్ – జమ్ము కాశ్మీర్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ 210 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు సృష్టిస్తుందా? లేక ఇంగ్లాండ్ అరుదైన ఘనతను సాధిస్తుందా? వేచి చూడాల్సి ఉంది.