Ind Vs Eng 3T20: రాజ్ కోట్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు గెలిచిందనే దానికంటే.. టీమిండియా స్వయంకృతాపరాధం వల్ల ఓడిపోయిందని చెప్పడం సబబు.. ఎందుకంటే టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 9 నుంచి 16 ఓవర్ల మధ్య వికెట్ కోల్పోయి కేవలం 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా, సుందర్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యారు.. ఇక సుందర్ అవుట్ అయిన తర్వాత.. అక్షర్ పటేల్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు కూడా పెద్దగా సత్తా చూపించలేకపోయాడు. మెరుగ్గా ఆడాల్సిన సమయంలో.. దీటుగా ఇన్నింగ్స్ నిర్మించాల్సిన సమయంలో.. విఫలమయ్యాడు. ఇక మరో ఆటగాడు హార్థిక్ పాండ్యా 35 బంతులు ఎదుర్కొని పరుగులు చేశాడు. ఒకానొక దశలో 24 బంతుల్లో 21 పరుగులు చేసిన అతడు.. భారీ షాట్లు ఆడ లేకపోయాడు. పైగా స్ట్రైక్ రొటేట్ చేయడంలో అతడు విఫలమయ్యాడు.
పార్దివ్ పటేల్ ఏమన్నాడంటే..
మ్యాచ్ ముగిసిన తర్వాత.. టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ కు సంబంధించి విశ్లేషణ చేశాడు.. హార్థిక్ పాండ్యా పై కీలక వ్యాఖ్యలు చేశాడు..” హార్దిక్ పాండ్యా కీలకమైన ఆటగాడు. మెరుగైన ఆల్ రౌండర్.. అయితే అతడు 40 పరుగులతో ఇన్నింగ్స్ ముగించిన విధానం సరిగ్గా లేదు. 35 బంతులు ఎదుర్కొన్న అతడు 40 పరుగులు చేశాడు. కానీ అతడి సామర్థ్యానికి సరైన కొలబద్ద లాంటి ఇన్నింగ్స్ కాదది. అతడు ప్రారంభంలో అనేక బంతులను ఎదుర్కోలేకపోయాడు. తద్వారా అవి డాట్ బాల్స్ గా మారాయి.. అందువల్లే టీమిండియా ఇన్నింగ్స్ వేగం ఆశించినంత స్థాయిలో లేదు. హార్థిక్ పాండ్యా దూకుడుగా ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.. సూర్య కుమార్ యాదవ్ విఫలం కావడం.. తిలక్ వర్మ దురదృష్టవశాత్తు అవుట్ కావడం.. సంజు శాంసన్ మరోసారి చేతులెత్తేయడం.. వంటి పరిణామాలు టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణంగా మారాయి. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ గనుక టీమిండియా మేనేజ్మెంట్ సరిగా చేసి ఉంటే ఫలితం వేరే విధంగా వచ్చి ఉండేది.. అందువల్లే ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా మేనేజ్మెంట్ దృష్టి సారించాలని” పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. ” జూరెల్ ను నెంబర్ 8 స్థానంలోకి పంపించే బదులు.. అతడిని ముందుగానే రంగంలోకి దింపి ఉంటే బాగుండేది. కోల్ కతా, చెన్నై మాదిరిగా.. రాజ్ కోట్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు. పైగా ఆదిల్ రషీద్ ను టీమిండియా బ్యాటర్లు సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. అతడు వరల్డ్ క్లాస్ బౌలర్ అయినప్పటికీ అప్పుడప్పుడు చెత్త బంతులు వేస్తాడు. చివరికి ఆ బంతులను కూడా టీమిండియా ఆటగాళ్లు తమకు అనుకూలంగా మలచుకోలేకపోయారు. అందువల్లే టీం ఇండియా ఈ ఓటమిని చేజేతులా స్వీకరించాల్సి వచ్చిందని” ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు.